PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

రెసెషన్లో జర్మనీ – భారత్‌కు ఎంత నష్టం?

[ad_1]

Germany Economic Recession: 

జర్మనీలో ఆర్థిక  మాంద్యం భారత్‌ ఎగుమతులపై ప్రభావం చూపిస్తుందని సీఐఐకి చెందిన ఎక్స్‌పోర్ట్స్‌ అండ్‌ ఇంపోర్ట్స్‌ కమిటీ ఛైర్మన్‌ సంజయ్‌ బుధియా అన్నారు. రసాయనాలు, మెషినరీ, దుస్తులు, ఎలక్ట్రానిక్స్‌ రంగాలపై ప్రభావం పడుతుందన్నారు. అయితే ఎంత శాతం ఉంటుందో ఇప్పుడే చెప్పడం తొందరపాటే అవుతుందన్నారు.

‘2022లో భారత ఎగుమతుల్లో 4.4 శాతం జర్మనీకి వెళ్లాయి. ఆర్గానిక్‌ కెమికల్స్‌, మెషినరీ, ఎలక్ట్రానిక్స్‌, దుస్తులు, ఫుట్‌వేర్‌, ఉక్కు, స్టీల్‌ వస్తువులు, తోలు వస్తువుల రంగాల నుంచి ఎగుమతులు ఎక్కువగా ఉన్నాయి. అయితే భారత ఎగుమతులపై జర్మనీ ఆర్థిక మాంద్యం ప్రభావం గురించి ఇప్పుడే చెప్పడం తొందరపాటే అవుతుంది. పైన చెప్పిన రంగాలపై మాత్రం కొంత ఉంటుంది’ అని  సంజయ్‌ బుధియా అన్నారు.

పెరుగుతున్న ఇంధన ధరల వల్లే జర్మనీ వరుసగా రెండు త్రైమాసికాల్లో ఆర్థికమాంద్యంలోకి జారుకుందని, ఐరోపా కూటమి ఇబ్బంది పడుతోందని ఆయన చెప్పారు. ‘కూటమిలోని అతిపెద్ద ఎకానమీ రెసెషన్‌లోకి జారుకోవడం వల్ల మొత్తం ఐరోపా ఒత్తిడి చెందుతోంది. భారత్‌ మొత్తం ఎగుమతుల్లో 14 శాతం ఈయూకే వెళ్తాయి. జర్మనీ ప్రధాన దిగుమతి దారుగా ఉండగా నెదర్లాండ్స్‌, బెల్జియం, ఇటలీ, ఫ్రాన్స్‌ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి’ అని సంజయ్‌ తెలిపారు.

గ్లోబల్‌ ట్రేడ్‌ రీసెర్చ్‌ ఇనిషియేటివ్‌ (GTRI) అంచనాల ప్రకారం భారత్‌పై జర్మనీ ఆర్థిక మాంద్యం ప్రభావం రెండు బిలియన్‌ డాలర్ల మేర ఉండొచ్చని సంజయ్‌ అన్నారు. స్మార్ట్‌ ఫోన్లు, ఫుట్‌వేర్‌, లెథర్ ఉత్పత్తుల రంగాలు ఇబ్బంది పడతాయని వెల్లడించారు. మన దేశంలో పెట్టుబడుల పైనీ ఈ ప్రభావం ఉంటుందన్నారు. రెసెషన్‌ వల్ల జర్మనీ భారత్‌ నుంచి తక్కువ ధర ఉత్పత్తులు కొనుగోలు చేయొచ్చని అంచనా వేశారు. ఫలితంగా జర్మనీ పెట్టుబడుల ప్రభావం తగ్గుతుందన్నారు.

భారత్‌కు వస్తున్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో జర్మనీ ర్యాంకు తొమ్మిదిగా ఉంది. రవాణా, ఎలక్ట్రిక్‌ ఉత్పత్తులు, మెటలర్జికల్‌ ఇండస్ట్రీస్‌, ఇన్సూరెన్స్‌ వంటి సర్వీసెస్‌, కెమికల్స్‌, నిర్మాణం, ట్రేడింగ్‌, ఆటో మొబైల్‌ రంగాల్లో 2000 నుంచి 2022 మధ్య 13.6 బిలియన్ డాలర్ల మేర ఇన్వెస్ట్‌ చేసింది.

Also Read: రూ. 10 లక్షల్లోపు మంచి బడ్జెట్ కార్లు – ఏది బెస్టో తెలుసా?

Germany Recession: 

ఐరోపా, అమెరికాకు బ్యాడ్‌న్యూస్‌! ప్రపంచం ఆర్థిక మాంద్యంలోకి జారుకోవడం మొదలైంది. ఐరోపాలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, జర్మనీ రెసెషన్‌లోకి జారుకుంది. వరుసగా రెండో క్వార్టర్లోనూ ఆ దేశ జీడీపీ కుంచించుకుపోయింది. క్యాలెండర్ ఇయర్లో సవరించిన ధరల ప్రకారం స్థూల జాతీయ ఉత్పత్తి 0.3 శాతానికి పడిపోయింది. 2022లోని చివరి మూడు నెలల్లోనూ జీడీపీ 0.5 శాతానికి పడిపోవడం గమనార్హం.

జర్మనీ ఆర్థిక మాంద్యంలోకి జారుకోవడానికి రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధమే ప్రధాన కారణం! అతి తక్కువ ధరకు క్రూడాయిల్‌, గ్యాస్‌ను ఎగమతి చేసే రష్యాపై ఆంక్షలు విధించడం వారికి చేటు చేసింది. కూర్చున్న కొమ్మనే నరికేసినట్టు మారింది! ఆర్థిక శాస్త్రం ప్రకారం వరుసగా రెండు త్రైమాసికాల్లో జీడీపీ కుంచించుకుపోతే ఆర్థిక మాంద్యం వచ్చినట్టుగా భావిస్తారు. ముందుగా అంచనా వేసిన సున్నా శాతాన్ని ఈ త్రైమాసికంలో నెగెటివ్‌ గ్రోత్‌ కిందకు ఫెడరల్‌ స్టాటిస్టిక్స్‌ ఏజెన్సీ సవరించింది.

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *