PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

రేట్లు పెరిగినా బాటిళ్లు ఖాళీ, రికార్డులకే కిక్‌ ఎక్కే స్థాయిలో తాగారు

[ad_1]

Record Liquor Sales in FY23: భారతదేశ ప్రజలు గత కొన్ని నెలలుగా ద్రవ్యోల్బణం తాకిడిని ఎదుర్కొంటున్నారు. ఆహార పదార్థాల నుంచి నిత్యావసరాల వరకు అనేక వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయి. దీంతో, ప్రజలు నిత్యావసరాల కొనుగోళ్లను కూడా తగ్గించుకున్నారు. అయితే, మద్యం విషయంలో మాత్రం ద్రవ్యోల్బణం గురించి అసలు పట్టించుకోలేదు. గత ఆర్థిక సంవత్సరంలో (2022-23), అనేక ఆహార పదార్థాల ధరలతో పాటు ఆల్కహాల్‌ రేట్లు కూడా పెరిగినా, మద్యం ప్రియులను అది ప్రభావితం చేయలేదు. మందుబాబులు ఎక్కువ డబ్బు చెల్లించి మరీ బాటిళ్లు కొన్నారు.

రికార్డ్‌ స్థాయిలో అమ్ముడుబోయిన అన్ని రకాల మద్యం
గత ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలో ప్రజలు దాదాపు 400 మిలియన్ కేసుల మద్యాన్ని కొనుగోలు చేశారని ఎకనమిక్‌ టైమ్స్‌ తన రిపోర్ట్‌లో రాసింది. సగటున తీసుకుంటే, 2022-23 ఆర్థిక సంవత్సరంలో, మద్యం ప్రియులు 4.75 బిలియన్ల 750 ml బాటిళ్లను కొనుగోలు చేశారు. విస్కీ అయినా, రమ్ అయినా, బ్రాందీ అయినా, జిన్ అయినా, ఓడ్కా అయినా… అన్ని రకాల మద్యం విరివిగా అమ్ముడైందని విక్రయాల లెక్కలు చెబుతున్నాయి. వీటితో పాటు ప్రీమియం బ్రాండ్స్‌, అంటే అధిక ధరల మద్యం విక్రయాలు కూడా ఎక్కువగానే జరిగాయి.

గత రికార్డ్‌ కంటే అమ్మకాలు చాలా ఎక్కువ
గణాంకాల ప్రకారం, 2022 ఏప్రిల్ 1వ తేదీ నుంచి 2023 మార్చి 31వ తేదీ వరకు, దేశవ్యాప్తంగా 39.5 కోట్ల మద్యం కేసుల విక్రయాలు నమోదయ్యాయి, ఏడాది క్రితం ఇదే కాలంతో పోలిస్తే ఇది 12 శాతం ఎక్కువ. 2018-19లో దేశవ్యాప్తంగా దాదాపు 35 కోట్ల మద్యం కేసులు అమ్ముడయ్యాయి. ఆ మద్యం అమ్మకాల రికార్డు 4 సంవత్సరాల తర్వాత బద్ధలైంది.

గత ఆర్థిక సంవత్సరంలో, మందు బాబులు 40 మిలియన్ కేసులను అదనంగా కొనుగోలు చేశారు, విక్రయాల రికార్డును 400 మిలియన్ కేసులకు తీసుకెళ్లారు.

గతేడాది బాగా పెరిగిన ధరలు 
గత ఆర్థిక సంవత్సరంలో దాదాపు అన్ని మద్యం కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలు పెంచాయి. ఇటీవలి కాలంలో ఎప్పుడూ లేనివిధంగా 2022-23 మధ్యకాలంలో భారతదేశంలో ధరలు పెరిగాయని ప్రముఖ మద్యం కంపెనీ పెర్నోడ్ రికార్డ్ (Pernod Ricard) అధికారి గత నెలలో విశ్లేషకుల కాల్‌లో తెలిపారు. ఇలా, కాలం గాని కాలంలో రేట్లు పెంచినా కస్టమర్ల నమ్మకం మాత్రం చెక్కుచెదరలేదు. రాబోయే కాలానికి సంబంధించి భారతీయ మార్కెట్‌పై చాలా అంచనాలను ఆ అధికారి వ్యక్తం చేశాడు. పెర్నోడ్ రికార్డ్ కంపెనీ, మన దేశంలో ఎంట్రీ లెవల్‌ రాయల్ స్టాగ్ విస్కీని విక్రయిస్తుంది. ప్రీమియం విభాగంలో బాలంటైన్, చివాస్ రీగల్, ది గ్లెన్‌లివెట్ వంటి బ్రాండ్‌లను అమ్ముతుంది. ఓడ్కా విభాగంలో సంపూర్ణ బ్రాండ్‌ను విక్రయిస్తుంది.

విస్కీ ఎక్కువగా తాగుతున్నారు
ఎకనమిక్‌ టైమ్స్‌ నివేదిక ప్రకారం, భారతదేశ ప్రజలు విస్కీని ఎక్కువగా తాగుతున్నారు. గత ఏడాది దీని విక్రయాలు 11.4 శాతం వృద్ధి చెందాయి, భారత్‌లోని మొత్తం మద్యం విక్రయాల్లో మూడింట రెండొంతుల అమ్మకాలు దీనివే. అదే సమయంలో, మొత్తం అమ్మకాల్లో 21 శాతం బ్రాందీ, 12 శాతం రమ్ బాటిల్స్‌ ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఓడ్కా, జిన్ అమ్మకాలు అత్యంత భారీ వృద్ధిని సాధించాయి. వాటి అమ్మకాలు వరుసగా 29 శాతం, 61 శాతం పెరిగాయి.

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *