PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

రైతన్నలూ! నేడే మీ ఖాతాల్లో రూ.2000 జమ అవుతాయ్‌!

[ad_1]

PM Kisan Samman Nidhi:

రైతన్నలకు శుభవార్త! సోమవారమే మీ బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయి. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధులు విడుదల చేస్తున్నారు. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. అర్హులైన అన్నదాతల ఖాతాల్లో రూ.2000 జమ అవుతాయని వెల్లడించింది. దేశ వ్యాప్తంగా 8 కోట్ల మందికి పైగా  రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ అవుతాయని స్పష్టం చేసింది. 13వ విడత నిధుల విడుదలతో పాటు కర్ణాటకలోని బెలగావిలో భారతీయ రైల్వే, జల్‌ జీవన్‌ మిషన్‌ కార్యక్రమాల్లోనూ మోదీ పాల్గొంటున్నారు.

పీఎం కిసాన్ యోజన సొమ్ము కోసం రైతులు ఈ కేవైసీ చేయాల్సి ఉంది. ఇప్పటికీ ఎవరైనా కేవైసీ చేయనివారు ఉంటే ఇప్పుడైనా చేసుకోవచ్చు. పీఎం కిసాన్ వెబ్ సైట్ లోకి వెళ్లి వివరాలు ఇవ్వవచ్చు. లేదంటే 13వ విడత డబ్బులు వారికి రావు. 

ఈ- కేవైసీ ఇలా చేయాలి

ముందుగా అధికారిక వెబ్ సైట్ (https://pmkisan.gov.in) కి వెళ్లాలి.
ఈ-కేవైసీ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి.
అక్కడ ఆధార్ నెంబర్ ను నమోదు చేయాలి. 
ఇమేజ్ కోడ్ ను నమోదు చేసి, సెర్ట్ బటన్ పై క్లిక్ చేయాలి.
అనంతరం మొబైల్ నంబర్ ను ఎంటర్ చేసి, ఓటీపీని టైప్ చేయాలి. 
మీరిచ్చిన అన్ని వివరాలు సరిగ్గా ఉంటే ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తయినట్లే. 
ఒకవేళ వివరాలు సరిగ్గా లేకుంటే ఈ- కేవైసీ పూర్తవదు.

ప్రధానమంత్రి కిసాన్ యోజన అంటే ఏమిటి?

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద, మోదీ ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేయడానికి చిన్న మరియు మధ్య తరగతి రైతులకు ఏటా రూ. 6,000 రూపాయలు ఇస్తోంది. ఈ మొత్తాన్ని రూ. 2వేలు చొప్పున 3 విడతలుగా ఇస్తున్నారు. 

ఆధార్‌ కార్డు జత చేస్తేనే!

రైతులు ముందుగా ఏ బ్యాంక్ అకౌంట్‌కు ఆధార్ కార్డును లింక్ చేశారో ఆ బ్యాంక్ బ్రాంచ్‌ లో జమ చేస్తారు.  రైతులు తమ వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో https://pmkisan.gov.in/ వెబ్‌సైట్‌లో కూడా తెలుసుకోవచ్చు. అన్నీ కరెక్ట్‌గా ఉంటే పీఎం కిసాన్ డబ్బులు జమ అవుతాయి. వివరాల్లో తప్పులు ఉంటే వెబ్‌సైట్‌లోనే మార్పులు చేసుకునే అవకాశం ఉంది. 

కొత్త రిజిస్ట్రేషన్‌కు రేషన్ కార్డు తప్పనిసరి!

పీఎం కిసాన్ యోజన కింద ఇంకా నమోదు చేసుకోని రైతులు నమోదు చేసుకోవడానికి రేషన్ కార్డు అవసరం. రేషన్ కార్డులు లేని రైతులు వెంటనే రేషన్ కార్డులు చేయించుకోవాలి. పీఎం కిసాన్ యోజనలో రిజిస్ట్రేషన్ కోసం ప్రభుత్వం రేషన్ కార్డును తప్పనిసరి చేసింది. ఈ పథకాన్ని అర్హత లేని వ్యక్తులు కూడా దీని నుంచి లబ్ధి పొందుతున్నారు. దీని వల్ల చాలా మంది అనర్హుల ఖాతాల్లోకి డబ్బులు వెళ్తున్నాయి. ఈ మోసాన్ని నివారించడానికి, రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు రేషన్ కార్డు కాపీని పోర్టల్‌లో అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. పోర్టల్లో రేషన్ కార్డు నంబర్ నమోదు చేసిన తర్వాత మాత్రమే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి రూ.2,000 ఇన్‌స్టాల్‌మెంట్‌ ఖాతాల్లో పడుతుంది. పిఎం కిసాన్ యోజన పొందాలనుకునే లబ్ధిదారులు రిజిస్టర్ చేసేటప్పుడు తప్పనిసరి రేషన్ కార్డుతోపాటు ఇతర డాక్యుమెంట్ల సాఫ్ట్ కాపీని పోర్టల్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *