PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

లాభాలతో లిస్టయిన నందన్‌ నీలేకని కంపెనీ

[ad_1]

Divgi TorqTransfer Shares: ఆటో కాంపోనెంట్స్ తయారీ కంపెనీ దివ్గీ టార్క్‌ట్రాన్స్‌ఫర్ సిస్టమ్స్ (Divgi TorqTransfer) షేర్లు NSEలో 5.08% ప్రీమియంతో లిస్ట్‌ అయ్యాయి. NSEలో రూ. 620 వద్ద, BSEలో రూ. 600 (1.69% ప్రీమియం) వద్ద ఈ షేర్లు దలాల్‌ స్ట్రీట్‌ జర్నీని ప్రారంభించాయి. 

IPO ప్రైస్‌ బ్యాండ్‌ను రూ. 560-590గా దివ్గీ టార్క్‌ట్రాన్స్‌ఫర్ సిస్టమ్స్‌ నిర్ణయించింది. ఎంత ప్రీమియంతో లిస్ట్‌ అయిందన్న లెక్క కోసం, IPO ప్రైస్‌ బ్యాండ్‌ అప్పర్‌ ఎండ్‌ను (రూ. 590) మార్కెట్‌ పరిగణనలోకి తీసుకుంటుంది. 

మార్చి 1, 2023న ప్రారంభమైన దివ్గీ టార్క్‌ట్రాన్స్‌ఫర్ సిస్టమ్స్ IPO మార్చి 3వ తేదీన ముగిసింది. రిటైల్ ఇన్వెస్టర్లు బాగా ఆసక్తి చూపడంతో, IPO మొత్తం 5.44 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. 

ఈ ఆఫర్‌లో 75% కోటాను అర్హత కలిగిన సంస్థాగత కొనుగోలుదారులకు (QIBs), 15% నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు (NIIs), 10% రిటైల్ ఇన్వెస్టర్లకు రిజర్వ్ చేశారు. 

రిటైల్ భాగం 4.31 రెట్లు సబ్‌స్క్రైబ్ అయితే, నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల నుంచి 1.4 రెట్లు ఎక్కువ బిడ్స్‌ వచ్చాయి. అర్హత కలిగిన సంస్థాగత కొనుగోలుదారులకు కేటాయించిన భాగం కంటే 7.83 రెట్లు అధికంగా సబ్‌స్క్రైబ్ అయింది.

షేర్లు విక్రయించిన నందన్ నీలేకని కుటుంబం
ఈ కంపెనీ రూ. 180 కోట్ల విలువైన ఫ్రెష్‌ ఈక్విటీ షేర్లను, 39.34 లక్షల ఆఫర్ ఫర్ సేల్ (OFS) షేర్లను IPO ద్వారా ఆఫ్‌లోడ్‌ చేసింది.

OFSలో భాగంగా… నందన్ నీలేకని కుటుంబ ట్రస్ట్ 14.4 లక్షల షేర్లను విక్రయించింది. OFSలో విక్రయించిన ఇతర వాటాదార్లలో.. భరత్ బాల్‌చంద్ర దివ్గీ, సంజయ్ బాలచంద్ర దివ్గీ, ఆశిష్ అనంత్ దివ్గీ, అరుణ్ రామ్‌దాస్, కిషోర్ మంగేష్ కల్బాగ్ ఉన్నారు.

IPO ప్రైస్ బ్యాండ్ అప్పర్‌ ఎండ్‌ ప్రకారం ఈ కంపెనీ దాదాపు రూ. 412 కోట్లు సేకరించింది. 

కంపెనీ వ్యాపారం –  ఆర్థిక పరిస్థితి
పుణె కేంద్రంగా దివ్గీ టార్క్‌ట్రాన్స్‌ఫర్ సిస్టమ్స్ పని చేస్తోంది. భారతదేశంలోని ప్రముఖ OEMలకు ట్రాన్స్‌ఫర్ కేస్ సిస్టమ్స్, టార్క్ కప్లర్‌లను సరఫరా చేస్తోంది. 

ఈ పబ్లిక్ ఆఫర్ డీసెంట్‌ వాల్యూతో ఉందని చెప్పిన చాలామంది ఎనలిస్ట్‌లు, ఇష్యూను సబ్‌స్క్రైబ్‌ చేసుకోవచ్చని సిఫార్సు చేశారు. దేశంలో టార్క్ కప్లర్‌లను తయారు చేస్తున్న ఏకైక సంస్థ ఇదని చెప్పారు. దీర్ఘకాలిక పెట్టుబడి దృష్టితో IPOలో బిడ్స్‌ వేయాలని సూచించారు.

సెప్టెంబర్ 2022 నాటికి ఈ కంపెనీ రూ. 26 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది, అదే సమయంలో మొత్తం ఆదాయం రూ. 137 కోట్లుగా ఉంది. FY20 – FY22 మధ్య, కంపెనీ పన్ను తర్వాతి లాభం 28.30% CAGR వద్ద పెరిగింది. FY22 వరకు ఉన్న కంపెనీ ఆర్థిక స్థితిగతులపై చాలా బ్రోకరేజీలు సంతృప్తి వ్యక్తం చేశాయి. 

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *