PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

విటమిన్‌ ‘ఇ’ రిచ్‌ ఫుడ్స్‌తో.. మీ చర్మం ఆరోగ్యంగా ఉంటుంది..!

[ad_1]

Vitamin E Rich foods: మనం ఆరోగ్యంగా, యాక్టివ్‌గా ఉండటానికి విటమిన్స్‌, మినరల్స్‌ వంటి పోషకాలు ఎంతో అవసరం. ఇవి శరీర జీవక్రియలో సహాయపడతాయి. వాటిలో విటమిన్‌ ఇ ఒకటి. మన శరీరంలో జీవక్రియను బలోపేతం చేయడానికి విటమిన్‌ ఇ చాలా అవసరం. విటమిన్‌‌ ‘E’ శరీరంలో శరీరంలో యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇది మన ఇమ్యూనిటీ పెంచడానికి సహాయపడుతుంది. ఇది కణాలను ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షిస్తుంది. విటమిన్ ఇ కంటి సమస్యలను తగ్గిస్తుంది. యూవీ కిరణాల నుంచి చర్మాన్ని రక్షిస్తుంది. వృద్ధాప్య ఛాయలను దూరం చేస్తుంది. విటమిన్‌ E.. తలలో రక్తప్రసరణను మెరుగుపరచి జుట్టు సమస్యలను దూరం చేస్తుంది. మన శరీరంలో విటమిన్‌ ఇ లోపం ఉంటే.. కంటి సమస్యలు, చర్మ సమస్యలు, ఇమ్యూనిటీ తగ్గడం వంటి సమస్యలు ఎదురవుతాయి. చాలా మంది విటమిన్‌ ఇ సప్లిమెంట్స్‌ తీసుకుంటూ ఉంటారు. యుఎస్ నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ డేటా ప్రకారం పెద్దలకు రోజుకు 15 మైక్రోగ్రాముల విటమిన్ ఇ సరిపోతుంది. మీరు తీసుకునే డైట్‌ ద్వారా.. విటమిన్‌ ఇ లోపాన్ని దూరం నివారించవచ్చు.

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *