PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

వీటిని తాగితే ఒంట్లోని తగ్గి జీర్ణ సమస్యలు దూరమవుతాయి..


ఎండలు దంచికొడుతున్నాయి. విపరీతమైన చెమట దాహాన్ని పెంచుతుంది. అలసటగా కూడా ఉంటుంది. వేసవిలో ఇమ్యూనిటీ తగ్గుతుంది. కడుపులో సమస్యలు వస్తాయి. పేగు సమస్యలు ఇందులో ఒకటి. ఉదర సంబంధ సమస్యలతో బాధపడేవారు మొటిమలు, అతిసారం, యూటీఐ, తలనొప్పి వంటి సమస్యలతో బాధపడతారు. అలా కాకుండా ఉండేందుకు కొన్ని ఫుడ్ చేంజెస్ చేయాలి. అందులో ఆయుర్వేద డాక్టర్ అల్కా విజయన్ వేసవిలో పేగు ఆరోగ్యాన్ని కాపాడేందుకు బెస్ట్ డ్రింక్స్‌ని సజెస్ట్ చేస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

​అరటి గుజ్జు రసం..

అరటి గుజ్జు రసం గురించి చాలా మందికి తెలియదు. అరటిపండు గుజ్జులో అనేక ఎసెన్టిలా పోషకాలు ఉంటాయి. దీనిని ఎండాకాలంలో తీసుకోవాలి. శరీరంలో మంటతో బాధపడేవారు ఈ రసాన్ని రోజూ డైట్‌లో చేర్చుకోవడం మంచిది. షుగర్ ఉన్నవారికి మరీ మంచిది.

బాడీలోని కొవ్వుని తగ్గించే డ్రింక్స్..

బాడీలోని కొవ్వుని కరిగించే డ్రింక్..

​గుల్కంద్ పాలు..

​గుల్కంద్ పాలు..

ఇక వేసవిలో వేడి కారణంగా పిత్త దోషం పెరుగుతుంది. దీంతో చాలా మంది ఇబ్బందులు పడతారు. కాబట్టి రాత్రి పడుకునే ముందు గుల్కండ్ పాలు తీసుకోవడం వల్ల బాడీ కూల్ అవుతుంది. మంచి నిద్ర కూడా మీ సొంతమవుతుంది.

​చెరకు రసం..

​చెరకు రసం..

ఎండాకాలంలో చెరకు రసం ఎక్కువగా ఉంటుంది. చెరకు రసం కూడా బాడీని కూల్ చేస్తుంది. దీనిని తాగడం వల్ల ఇన్‌స్టంట్ ఎనర్జీ అందుతుంది.
Also Read : Healthy Food : పాలల్లో ఈ పొడి కలిపి తాగితే షుగర్ ఉన్నవారికి మంచిదట..

​మంచినీరు..

​మంచినీరు..

మూత్రంలో మంట, పిత్త బ్యాలెన్స్ సమస్య ఉన్నవారికి మంచినీరు బెస్ట్. మంచినీటిని తీసుకోవడం వల్ల బాడీ కూల్ అవుతుంది. ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్స్ అవుతాయి. కాబట్టి, మంచినీరు తాగుతుండాలి.
Also Read : ఉల్లిపాయ ఎక్కువగా తింటే ఆ ప్రాంతంలో దుర్వాసన వస్తుందా..

నిమ్మరసం..

నిమ్మరసం..

ఎండాకాలంలో రాత్రుళ్ళు నీరు తీసుకోం కాబట్టి డీహైడ్రేషన్‌గా అనిపిస్తుంటుంది చాలా మందికి. అలాంటి వారు నిమ్మరసం తాగాలి. దీనిని తాగడం వల్ల మంచి బెనిఫిట్స్ అందుతాయి. అందుకోసం 1 టీ స్పూన్ చియా సీడ్స్‌ని నిమ్మరసంలో నానబెట్టి తాగాలి. దీని వల్ల ఎలక్ట్రోలైట్ల బ్యాలెన్స్ బావుంటుంది.

​మజ్జిగ..

​మజ్జిగ..

చాలా మంది ఇళ్ళలో మజ్జిగ తీసుకుంటారు. ముఖ్యంగా ఎండాకాలంలో మజ్జిగ తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిని తీసుకోవడం వల్ల బాడీకి అవసరమైన పోషకాలన్నీ అందుతాయి. శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. అందుకోసం మీ భోజనంతో పాటు ఓ గ్లాసు మజ్జిగ కూడా తీసుకోవాలి. అంతేకాదు, దీనిని తీసుకుంటే బరువు కూడా తగ్గుతారు.

​​​​​గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
​​​​​​​​​​Read More : Health News and Telugu News



Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *