PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

వృద్ధులం బాబయ్యా! పన్ను భారం తగ్గించి ఈ కోర్కెల్‌ తీర్చండి మోదీ సాబ్‌!


Budget 2023:

ప్రస్తుత దేశ జనాభా 140 కోట్లు. అందులో 10.36 శాతం మంది వృద్ధులే! ఈ వయసులో పనిచేయడం చాలా కష్టం. కొందరు ఇప్పటికీ శారీరకంగా శ్రమిస్తూనే ఉన్నారు. మరికొందరు వడ్డీలు, ఇతర ఆదాయ వనరులపై ఆధారపడి జీవిస్తున్నారు. ఇప్పటికే వంగిన తమ వెన్నెముకలపై మరింత పన్నుభారం మోపొద్దని కోరుతున్నారు. బడ్జెట్‌ 2023 నుంచి కొన్ని మినహాయింపులు, కొన్ని వరాలు ఇవ్వాలని ఆశిస్తున్నారు.

సెక్షన్‌ 80సీ పరిమితి పెంపు

ఎప్పుడో 2014లో సెక్షన్‌ 80సీ కింద పన్ను మినహాయింపు పెంచారు. అప్పట్లో రూ.లక్షగా ఉన్న పరిమితిని రూ.1.5 లక్షలకు సవరించారు. ఇప్పుడు దాని పరిధిని మరింత పెంచాలని వృద్ధులు కోరుతున్నారు. సీనియర్‌ సిటిజన్స్‌ సేవింగ్స్‌ స్కీమ్‌, టర్మ్ డిపాజిట్లు, ఎల్‌ఐసీ, పీపీఎఫ్‌, ఎన్‌ఎస్‌సీ చందాలు, ఇతర వడ్డీ ఆదాయాల మినహాయింపు పరిమితి పెంచాలని అడుగుతున్నారు. 60 ఏళ్లు దాటిని వారికి ఇప్పుడు రూ.1.5 లక్షలకు అదనంగా మరో రూ.50వేలు డిడక్షన్‌ ఇవ్వాలంటున్నారు.

News Reels

లాకిన్‌ పీరియడ్‌ తగ్గింపు

ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్‌ 80సీ కింద కొన్ని పెట్టుబడులపై వడ్డీ ఆదాయంపై మినహాయింపు ఇస్తున్నారు. అయితే ఆ పెట్టుబడులపై లాకిన్‌ పీరియడ్‌ 3 నుంచి 5 ఏళ్ల వరకు ఉంటోంది. ఈఎల్‌ఎస్‌ఎస్‌పై మూడేళ్లు, టర్మ్‌, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై ఐదేళ్ల లాకిన్‌ పీరియడ్‌ ఉంది. దీనివల్ల కరోనా, ఆరోగ్య, ఇతర అవసరాలకు డబ్బులు విత్‌డ్రా చేసుకోలేక ఇబ్బంది పడుతున్నారు. సీనియర్‌ సిటిజన్ల వరకు లాకిన్‌ పిరియడ్లలో మార్పులు చేయాలని కోరుతున్నారు.

వడ్డీ ఆదాయంపై మినహాయింపు పెంపు

సెక్షన్‌ 80 టీటీబీ ప్రకారం పోస్టాఫీసు, బ్యాంకు, కోఆపరేటివ్‌ సొసైటీ డిపాజిట్లపై వచ్చే వడ్డీ ఆదాయంపై వృద్ధులకు రూ.50వేల మేర మినహాయింపు ఉంది. ఐదేళ్లుగా ఈ పరిమితిని పెంచలేదు. ద్రవ్యోల్బణం పరిస్థితుల్లో దీనిని రూ.75వేలకు పెంచాలని కోరుతున్నారు. అలాగే ఎన్‌ఎస్‌ఈ కింద వడ్డీని ఇందులో కలపాలని మొర పెట్టుకుంటున్నారు.

వైద్య ఖర్చుల పరిధి పెంపు

కరోనా మొదలయ్యాక అందరికీ ఆరోగ్య సమస్యలు ఎక్కువయ్యాయి. ఆరోగ్య ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగింది. మెడిక్లెయిన్‌ ప్రీమియం చుక్కలు చూపిస్తోంది. ప్రస్తుతం సెక్షన్‌ 80డీ కింద రూ.50వేలు మినహాయింపు ఉంది. దీనిని రూ.లక్షకు పెంచాలని కోరుతున్నారు.

ఐటీఆర్‌ దాఖలు వయసు తగ్గింపు

ఆదాయపన్ను చట్టంలోని 194పీ సెక్షన్‌ ప్రకారం 75 ఏళ్లు దాటిన వృద్ధులు ఆదాయపన్ను రిటర్న్‌ దాఖలు చేయాల్సి అవసరం లేదు. ఇందుకు ఆ వ్యక్తి గతేడాది భారత నివాసి అవ్వాలి. పెన్షన్‌ వచ్చే బ్యాంకుల్లోనే వడ్డీ ఆదాయం వస్తూ ఉండాలి. ఈ ప్రయోజనాన్ని 65 ఏళ్ల వయసున్న వృద్ధులకూ కల్పించాలన్న డిమాండ్లు ఉన్నాయి.

80DDB పరిధి పెంపు

సెక్షన్‌ 80DDB ప్రకారం ఆదాయపన్ను చెల్లింపు దారుడు, వారి భాగస్వామి, పిల్లలు, తల్లిదండ్రులు, సోదరులు, సోదరీమణుల వైద్య ఖర్చులకు చెల్లించిన డబ్బుపై మినహాయింపు పొందొచ్చు. సీనియర్‌ సిటిజన్లకు ఇది రూ.100,000గా ఉంది. ఇప్పటి రేట్లను బట్టి దీనిని రూ.150,000 పెంచాలని అంటున్నారు.



Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *