PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

శాశ్వతంగా దుకాణం మూసేస్తున్న 9 స్టాక్స్‌, ఇకపై వీటిలో ట్రేడింగ్‌ కుదరదు


Delisting stocks: తొమ్మిది కంపెనీలు స్టాక్‌ మార్కెట్‌ నుంచి డీలిస్ట్‌ అవుతున్నాయి. ఇప్పటికే డీలిస్టింగ్‌ ప్రక్రియ ప్రారంభమైంది, సెక్యూరిటీలను మార్కెట్‌ నుంచి పూర్తిగా వెనక్కు తీసుకుంటున్నారు. ఈ ప్రాసెస్‌ పూర్తయ్యాక, ఆయా కంపెనీ షేర్లు ఎక్స్ఛేంజ్‌ల్లో కనిపించవు, వాటిలో ట్రేడ్‌ చేయడం కుదరదు.

ఎక్స్ఛేంజీల నుంచి డీలిస్ట్‌ అవుతున్న 9 స్టాక్స్‌ ఇవి: 

ఫార్మేసియా – Phaarmasia
ఫార్మేసియాకు సంబంధించిన డీలిస్టింగ్ ఆఫర్ 15 ఫిబ్రవరి 2023న ప్రారంభించమైంది, 21 ఫిబ్రవరి 2023న ముగుస్తుంది. డీలిస్టింగ్‌లో భాగంగా ఇచ్చిన ఆఫర్ ధర రూ. 25. ఆఫర్ మొత్తం విలువ రూ.4.52 కోట్లు. మనీష్ ఫార్మాస్యూటికల్స్ ఈ షేర్లను కొనుగోలు చేస్తోంది.

అమృత్ కార్పొరేషన్ – Amrit Corp
అమృత్ కార్పొరేషన్ డీలిస్టింగ్ ఆఫర్ 3 జూన్ 2022న ప్రారంభమైంది, 2 జూన్ 2023న ముగుస్తుంది. డీలిస్టింగ్‌ ఆఫర్ ధర రూ. 945 కాగా, ఆఫర్ మొత్తం విలువ రూ. 20.85 కోట్లు. నరేష్ కుమార్ బజాజ్, అశ్విని బజాజ్, విక్రమ్ బజాజ్, అమృత్ బనస్పతి, మరియు AK బజాజ్ ఇన్వెస్ట్‌మెంట్ ఈ షేర్ల కొనుగోలుదార్లు.

భాగ్యనగర్ ప్రాపర్టీస్ – Bhagyanagar Properties
భాగ్యనగర్ ప్రాపర్టీస్ డీలిస్టింగ్ ఆఫర్ 19 డిసెంబర్ 2022న ప్రారంభమైంది, 18 డిసెంబర్ 2023న ముగుస్తుంది. డీలిస్టింగ్‌ ఆఫర్ ధర రూ. 42.25. ఆఫర్ మేనేజర్‌గా ఆకాశమ్ కన్సల్టింగ్, రిజిస్ట్రార్ కెఫిన్ టెక్నాలజీస్ వ్యవహరిస్తున్నాయి.

గోల్డ్‌క్రెస్ట్ కార్పొరేషన్ -Goldcrest Corp
గోల్డ్‌క్రెస్ట్ కార్ప్ షేర్ల డీలిస్టింగ్‌లో రూ. 200 ఆఫర్ ధర నిర్ణయించారు. ఆఫర్ మొత్తం విలువ రూ. 10.84 కోట్లు. 12 అక్టోబర్ 2022న స్క్రిప్‌ల డీలిస్టింగ్‌ ప్రారంభమైంది, 12 అక్టోబర్ 2023న ముగుస్తుంది. డీలిస్ట్ చేస్తున్న సెక్యూరిటీల కొనుగోలుదారు నీతా తుషార్ తన్నా.

ఇంటర్నేషనల్‌ కన్‌స్ట్రక్షన్‌ – International Construction
ఇంటర్నేషనల్ కన్‌స్ట్రక్షన్‌ షేర్ల డీలిస్టింగ్ ఆఫర్ 12 జనవరి 2023న ప్రారంభమైంది, 12 జనవరి 2024న ముగుస్తుంది. డీలిస్టింగ్‌లో ఇచ్చిన ఆఫర్ ధర రూ. 16.50, ఆఫర్ మొత్తం విలువ 21 లక్షలు. ఆఫర్ కింద కొనుగోలు చేస్తున్న వ్యక్తి ప్రీతి దేవి సేథి.

పెర్ల్ అపార్టుమెంట్స్‌ – Pearl Apartments
హౌసింగ్ కంపెనీ పెర్ల్ అపార్టుమెంట్స్‌ షేర్ల డీలిస్టింగ్‌ 17 మే 2022న ప్రారంభమైంది, 16 మే 2023న ముగుస్తుంది. డీలిస్టింగ్ కోసం ఇచ్చిన ఆఫర్ ధర రూ. 44.05. ఆఫర్ పరిమాణం రూ. 0.21 కోట్లు. ఆఫర్ కింద కొనుగోలు చేస్తున్న వ్యక్తి  నకుల్ సేత్.

రెమి సెక్యూరిటీస్ – Remi Securities
ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్లేయర్ అయిన రెమి సెక్యూరిటీస్ డీలిస్టింగ్ కోసం ఆఫర్ ధర రూ. 16గా నిర్ణయించారు. ఆఫర్ మొత్తం విలువ రూ.0.28 కోట్లు. బజరంగ్ ఫైనాన్స్, కె.కె.ఫిన్‌కార్ప్, రెమి ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్, రెమి సేల్స్ అండ్ ఇంజినీరింగ్ డిలిస్టెడ్‌ సెక్యూరిటీలను పొందుతాయి. 2022 మార్చి 22న స్క్రిప్‌ని డీలిస్టింగ్ ప్రారంభమైంది, 21 మార్చి 2023న ముగుస్తుంది.

ఘన కంటైనర్స్‌ – Solid Containers
ఈ కంపెనీ షేర్ల డీలిస్టింగ్ ఆఫర్ 21 మార్చి 2022న ప్రారంభమైంది, 2023 మార్చి 20న ముగుస్తుంది. ఆఫర్ ధరగా రూ. 45ని నిర్ణయించారు. ఆఫర్ సైజ్‌ రూ. 1.17 కోట్లు. డీలిస్ట్ చేస్తున్న సెక్యూరిటీల కొనుగోలుదారు వ్యోమన్ ఇండియా. 

TCI డెవలపర్స్‌ – TCI Developers
TCI డెవలపర్స్‌ డీలిస్టింగ్ ఆఫర్ 18 నవంబర్ 2022న ప్రారంభమైంది, నవంబర్ 17, 2023న ముగుస్తుంది.  డీలిస్టింగ్ కోసం ఇచ్చిన ఆఫర్ ధర రూ. 400. ఆఫర్ పరిమాణం రూ. 12.57 కోట్లు. డీలిస్టెడ్‌ సెక్యూరిటీల కొనుగోలుదారు TDL రియల్ ఎస్టేట్ హోల్డింగ్స్.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.



Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *