PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

షుగర్‌ పేషెంట్స్‌ కొబ్బరి నీళ్లు తాగొచ్చా..?

[ad_1]

Coconut Water For Diabetics: ఎండలు స్టార్ట్‌ అయ్యాయి. అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోవడానికి బెస్ట్‌ రిఫ్రెష్‌మెంట్‌ డ్రింక్‌.. కొబ్బరి నీళ్లు. కొబ్బరి నీళ్లు ఎండవేడిని, డీహైడ్రేషన్‌, నిస్సత్తువను దూరం చేయడమే కాదు, అనేక అరోగ్య ప్రయోజనాలు అందిస్తాయి. అయితే, చాలా మంది షుగర్‌ పేషెంట్స్‌కు కొబ్బరి నీళ్లు తాగొచ్చా? లేదా? అనే సందేహం ఉంటుంది. కొబ్బరి నీళ్లు తాగితే బ్లడ్‌ షుగర్‌ లెవల్స్‌ పెరుగుతాయనే అనుమానము ఉంటుంది. అసలు షుగర్‌ పేషెంట్స్‌ కొబ్బరి నీళ్లు తీసుకోవచ్చో లేదో ఈ స్టోరీలో చూద్దాం.

ఈ పోషకాలు ఉంటాయి..

ఈ పోషకాలు ఉంటాయి..
  • ఒక కప్పు కొబ్బరి నీళ్లలో
  • చక్కెర: 6 గ్రాములు
  • కార్బోహైడ్రేట్లు: 9 గ్రాములు
  • సోడియం: 252 మిల్లీగ్రాములు
  • పొటాషియం: 600 మిల్లీగ్రాములు
  • ఐరన్: 0.7 మిల్లీగ్రాములు
  • విటమిన్ సి: 5.8 మిల్లీగ్రాములు
  • మెగ్నీషియం: 60 మిల్లీగ్రాములు
  • ఫైబర్: 2.6 గ్రాములు
  • ప్రోటీన్: 1.7 గ్రా
  • కొవ్వు: 0.5 గ్రాములు ఉంటాయి.

(image source – pixabay)

షుగర్‌ పేషెంట్స్‌ కొబ్బరి నీళ్లు తాగొచ్చా..?

షుగర్‌ పేషెంట్స్‌ కొబ్బరి నీళ్లు తాగొచ్చా..?

షుగర్‌ పేషెంట్స్‌.. కొబ్బరి నీళ్లు తాగొచ్చని నిపుణులు చెబుతున్నారు. మీటిలో సోడియం, పొటాషియం వంటి పోషకాలు ఉంటాయి, ఈ మినరల్స్‌‌ షుగర్‌ పేషెంట్స్‌కు మేలు చేస్తాయి. ఇందులో లారిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది, ఇది వ్యాధికారక క్రిములను నాశనం చేయడంలో సహాయపడుతుంది. తద్వారా వైరల్ ఇన్ఫెక్షన్లు, జలుబు నుంచి రక్షణ లభిస్తుంది. కొబ్బరి నీళ్లు రక్తంలో గ్లూకోజ్‌ స్థాయిలను కంట్రోల్‌లో ఉంచుతాయని అధ్యయనాలు స్పష్టం చేశాయి. కొబ్బరి నీళ్లలో యాంటీ-ఆక్సిడెంట్, హైపోగ్లైసీమిక్, నెఫ్రోప్రొటెక్టివ్ లక్షణాలు ఉన్నాయి. ఇవి డయాబెటిక్‌ పేషెంట్స్‌కు మేలు చేస్తాయి.

కొబ్బరి నీళ్లు షుగర్‌ పేషెంట్స్‌కు ఎలా మేలు చేస్తాయి..?

కొబ్బరి నీళ్లు షుగర్‌ పేషెంట్స్‌కు ఎలా మేలు చేస్తాయి..?

కొబ్బరి నీళ్లను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మీ బ్లడ్ షుగర్ లెవల్‌ కంట్రోల్‌లో ఉంటుంది, హిమోగ్లోబిన్ A1C (HbA1c) స్థాయిలు పెరుగుతాయి. ఆక్సీకరణ ఒత్తిడి గణనీయంగా తగ్గుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. తరచుగా.. హైపర్‌టెన్షన్‌, బ్లడ్‌ షుగర్‌కు ఒకదానితో ఒకటికి సంబంధం ఉంటుంది. కొబ్బరి నీళ్లు హైపర్‌టెన్షన్‌, డయాబెటిస్‌ను కంట్రోల్‌లో ఉంచడానికి సహాయపడతాయి.

ఈ పోషకాలు మేలు చేస్తాయి..

ఈ పోషకాలు మేలు చేస్తాయి..

కొబ్బరి నీళ్లలో విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్, ఎల్-అర్జినిన్‌లు మెండుగా ఉంటాయి. ఇవి ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో సహాయపడుతాయి. కొబ్బరి నీళ్లలోని కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, జింక్, కాపర్, అమైనో యాసిడ్స్‌ కూడా మెండుగా ఉంటాయి. కొబ్బరి నీళ్లు మిమ్మల్ని హైడ్రేట్‌గా ఉంటారు. మీ pH స్థాయిలను బ్యాలెన్స్‌లో ఉంచుతాయి. మీ మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తాయి. కొబ్బరి నీళ్లలోని విటమిన్లు, మినరల్స్‌ శరీరంలోని ఎలక్ట్రోలైట్స్‌ను తిరిగి నింపడానికి సహాయపడతాయి. రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్‌లో ఉంచుతాయి.

Also Read: ఈ లక్షణాలు ఉంటే.. డయాబెటిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉన్నట్లే..!

గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ తక్కువగా ఉంటుంది..

గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ తక్కువగా ఉంటుంది..

కొబ్బరి నీళ్లలో కార్బ్‌స్‌ తక్కువగా ఉంటాయి. అసంతృప్త కొవ్వులు ఉండవు, గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. కొబ్బరి నీటి గ్లైసెమిక్ ఇండెక్స్ కేవలం 3, కొబ్బరి నీళ్లు షుగర్‌ పేషెంట్స్‌కు సేఫ్‌ డ్రింగ్‌ అని చెప్పొచ్చు. కొబ్బరి నీళ్లలో మెగ్నీషియం మెండుగా ఉంటుంది, ఇది ఇన్సులిన్‌ ఉత్పత్తికి సహాయపడుతుంది. కొబ్బరి నీళ్లలో కొద్ది మొత్తంలో ఉండే.. సహజ చక్కెర మీ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచదు.

జీవక్రియ మెరుగుపడుతుంది..

జీవక్రియ మెరుగుపడుతుంది..

కొబ్బరి నీళ్లు జీవక్రియను మెరుగుపరుస్తుంది. దీనిలో కార్బ్‌స్‌ తక్కువగా ఉన్నప్పటికీ.. మీమ్మల్ని నిండుగా ఉంచుతాయి. దీనిలో కేలరీలూ తక్కువగా ఉంటాయి. ఇది మీ ఆకలిని తగ్గిస్తుంది, జీర్ణక్రియకు సహాయపడుతుంది. కొబ్బరి నీళ్లలో జీర్ణక్రియకు సహాయపడే బయోయాక్టివ్ ఎంజైమ్‌లు ఉంటాయి. ఇవి జీవక్రియను పెంచుతాయి, శరీరంలో పేరుకుపోయిన కొవ్వును విచ్ఛిన్నం చేస్తాయి.

రక్త ప్రసరణ మెరుగ్గా జరుగుతుంది..

రక్త ప్రసరణ మెరుగ్గా జరుగుతుంది..

రక్త ప్రసరణలో సమస్యల కారణంగా.. దృష్టి సమస్యలు, కండరాల నొప్పులు, కిడ్నీ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. కొబ్బరి నీళ్లు శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి.

Also Read: రక్తం శుద్ధి కావాలంటే.. ఇవి కచ్చితంగా తినాలి..!

యాంటీఆక్సిడెంట్స్‌ మెండుగా ఉంటాయి..

యాంటీఆక్సిడెంట్స్‌ మెండుగా ఉంటాయి..

కొబ్బరి నీళ్లలో యాంటీఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఇవి శరీరానికి హాని చేసే.. ఫ్రీ రాడికల్స్‌ నుంచి రక్షణ కల్పిస్తాయి. ఫ్రీ రాడికల్స్‌ షుగర్‌ పేషెంట్స్‌లో కాంప్లికేషన్స్‌ పెంచుతాయి. డయాబెటిక్‌ పేషెంట్స్‌ తరచుగా కొబ్బరి నీళ్లు తీసుకుంటే.. మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

Also Read: కొబ్బరి నీళ్లు తాగితే ఎండ వేడే కాదు.. ఈ అనారోగ్యాలూ దూరం అవుతాయి..!

కొబ్బరి నీళ్లు ఎప్పుడు తాగాలి..?

కొబ్బరి నీళ్లు ఎప్పుడు తాగాలి..?

మీరు రోజులో ఏ సమయంలోనైనా కొబ్బరి నీళ్లను తాగవచ్చు, అయితే ఉదయం కొబ్బరి నీళ్లు తాగితే.. చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. కొబ్బరి నీళ్లలో లారిక్ యాసిడ్ ఉంటుంది, ఇది జీవిక్రియను మెరుగుపరుస్తుంది. మిమ్మల్ని రోజంతా శక్తివంతంగా ఉంచుతుంది. రోజుకు ఒకటి కంటే ఎక్కువ గ్లాసుల తాజా కొబ్బరి నీరు త్రాగకూడదు.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *