PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

స్టాక్‌ మార్కెట్లో లక్ష్మీ కళ! నేడు రూ.3 లక్షల కోట్లు లాభపడ్డ మదుపర్లు!

[ad_1]

Stock Market Closing 26 May 2023: 

స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం ఊహించిన లాభాల్లో ముగిశాయి. గ్లోబల్‌ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందాయి. వచ్చే వారంలో మెరుగైన జీడీపీ గణాంకాలు విడుదల చేసే అవకాశం ఉండటం, బ్యాంకులు లాభాల్లో ఉండటం, అమెరికా అప్పుల పరిమితిపై సందిగ్ధం తొలగే అవకాశాలు ఉండటంతో మార్కెట్లు దూసుకెళ్లాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 178 పాయింట్లు పెరిగి 18,499 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 629 పాయింట్లు ఎగిసి 62,501 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 18 పైసలు బలపడి 82.56 వద్ద స్థిరపడింది.

BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)

క్రితం సెషన్లో 61,872 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 61,985 వద్ద మొదలైంది. 61,911 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 62,529 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 629 పాయింట్ల లాభంతో 62,501 వద్ద ముగిసింది.

NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)

గురువారం 18,321 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 18,368 వద్ద ఓపెనైంది. 18,333 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,508 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 178 పాయింట్లు పెరిగి 18,499 వద్ద క్లోజైంది.

Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)

నిఫ్టీ బ్యాంక్‌ లాభాల్లో ముగిసింది. ఉదయం 43,765 వద్ద మొదలైంది. 43,588 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 44,067 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఆఖరికి 336 పాయింట్లు పెరిగి 44,018 వద్ద స్థిరపడింది.

Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)

నిఫ్టీ 50లో 43 కంపెనీలు లాభాల్లో 7 నష్టాల్లో ఉన్నాయి. హిందాల్కో, రిలయన్స్‌, సన్‌ ఫార్మా, హిందుస్థాన్‌ యునీలివర్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌ షేర్లు లాభపడ్డాయి. ఓఎన్‌జీసీ, గ్రాసిమ్‌, భారతీ ఎయిర్‌టెల్‌, పవర్‌ గ్రిడ్‌, బజాజ్‌ ఆటో షేర్లు నష్టపోయాయి. అన్ని రంగాల సూచీలు పెరిగాయి. బ్యాంకు, ఆటో, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, మీడియా, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్‌, హెల్త్‌కేర్‌ సూచీలు గ్రీన్‌లో కళకళలాడాయి.

బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)

నేడు విలువైన లోహాల ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.160 తగ్గి రూ.60,710గా ఉంది. కిలో వెండి రూ.150 తగ్గి రూ.72,900 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.60 పెరిగి రూ.27,280 వద్ద ఉంది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.



[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *