PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

హార్ట్ వాల్వ్స్‌ ప్రాబ్లమ్స్‌కి ట్రీట్‌మెంట్ ఎలా ఉంటుందంటే

[ad_1]

సాధారణంగా గుండెలో నాలుగు వాల్వ్స్ ఉంటాయి. అవి.. ట్రైకస్పిడ్ వాల్వ్, పల్మనరీ వాల్వ్, మైట్రల్ వాల్వ్, ఆయోర్టిక్ వాల్వ్. ఆ నాలుగు వాల్వ్స్‌‌కి ప్రధానంగా రెండు రకాల సమస్యలు వస్తాయి. అవే వాల్వ్ సన్నబడటం (స్టెనోసిస్), వాల్వ్ లీక్ కావడం (రీగర్జిటేషన్), ఇవి ఎందుకొస్తాయి. లక్షణాలు ఏంటి. వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ట్రీట్‌మెంట్ ఎలా ఉంటుందో ఈ ఆర్టికల్‌లో తెలుసుకోండి.

వాల్వ్ సమస్యలకు కారణాలు..

వాల్వ్ సమస్యలకు కారణాలు..

కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల ఈ సమస్యలు వస్తాయి.
మరి కొందరిలో రుమాటిక్ హార్ట్ డిసీజెస్ వల్ల. .
కొన్నిసార్లు ఇవి పుట్టుక తోనే రావచ్చు (కొంజెనిటల్).
కొందరిలో అవి వయసు పెరగడం వల్ల (డీజనరేటిల్) రావచ్చు.
Also Read : Romantic Chat : రొమాంటిక్‌గా చాట్ చేస్తున్నారా.. జాగ్రత్త..

లక్షణాలు..

లక్షణాలు..

హార్ట్ ఫెయిల్యూర్‌తో ఆయాసం
పొడి దగ్గు
పడుకుంటే ఆయాసం వల్ల నిద్రనుంచి లేవాల్సిరావడం (నాక్టర్నల్ డిస్నియా).
గుండె దడ (పాల్పిటేషన్స్).
బలహీనంగా అయిపోవడం (వీక్నెస్).
ఒక్కోసారి గుండెనొప్పి కూడా రావచ్చు.
ఈ సాధారణ లక్షణాలతో పాటు కొందరిలో సమస్య వచ్చిన వాల్వ్‌ని బట్టి మరికొన్ని లక్షణాలు కనిపించొచ్చు. ఉదాహరణకు..

ట్రైకస్పిడ్వాల్వ్ లీక్ (రీగర్జిటేషన్)ఉంటే కాళ్లలో వాపు కనిపిస్తుంది.
మైట్రల్ వాల్వ్ సన్నం (స్టెనోసిస్) ఉంటే రక్తపు వాంతులు కావచ్చు. . అయోర్టిక్ వాల్వ్ సన్నం (స్టెనోసిస్) ఉంటే స్పృహ తప్పడం. ఇలాంటి లక్షణాలు ఉంటాయి.

ట్రాన్స్ ఈపోఫీజియల్ కార్డియోగ్రామ్..

ట్రాన్స్ ఈపోఫీజియల్ కార్డియోగ్రామ్..

ఇప్పుడు ట్రాన్స్ ఈసోఫీజియల్ ఎకో కార్డియోగ్రామ్ అనే పరీక్షతో గుండెను మరింత స్పష్టంగా చూడొచ్చు.

Also Read : Cancer : క్యాన్సర్స్ రావడానికి ముఖ్య కారణాలివే..

ట్రీట్‌మెంట్..

ట్రీట్‌మెంట్..

వాల్వ్ సమస్యలని కొంతవరకు మందులతో కంట్రోల్ చేయొచ్చు.
కొన్నిసందర్భాల్లో మందులతో చికిత్స సాధ్యం కాకపోతే రోగి పరిస్థితి (కండిషన్)బట్టి సర్జరీ అవసరం అవుతుంది. అంటే…
మైట్రాల్ వాల్స్‌ సన్నగా మారడం (స్టెనోసిస్) అయితే అలాంటి రోగుల్లో బెలూన్వాల్విలోప్లాస్టీ అనే చికిత్స ద్వారా సన్నబడ్డ వాల్వ్స్‌ని తిరిగి తెరవవచ్చు.
అయితే మిగతా వాల్వ్స్ సన్నగా మారి లీక్ అవుతున్నసందర్భాల్లో ఈ వాల్విలోప్లాస్టీ ప్రక్రియ సాధ్యం కాదు. అలాంటప్పుడు వాల్వ్ రీప్లేస్మెంట్ అన్నదే పరిష్కారం.
Also Read : Cycling Benefits : సైకిల్ తొక్కితే క్యాన్సర్స్ రావా..

వాల్వ్ రీప్లేస్‌మెంట్..

వాల్వ్ రీప్లేస్‌మెంట్..

ఈ క్రమంలో రెండు రకాల వాల్వ్స్ ఉపయెగించవచ్చు.

1) మెటల్ వాల్వ్ 2) టిష్యువాల్వ్

మెకానికల్వాల్వ్ (మెటల్వాల్వ్)ను ఉపయోగించినప్పుడు ఒక ప్రతికూలత (డిజడ్వాంటేజ్) వుంది. అలాంటి రోగులకు జీవితాంతం రక్తాన్ని పలుచబరిచే మందు ఎసిట్రోమ్వాడాల్సి ఉంటుంది.
ఇక టిష్యూవాల్వ్ అన్నవి ఇతర జంతువుల కండరాలతో చేసినవి. ఈ టిష్యూ వాల్వ్ వాడిన వాళ్లలో రక్తాన్ని పలుచబరిచే మందు ఎసిట్రోమ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది 15 ఏళ్ల వరకు పనిచేస్తుంది.

లేటెస్ట్ ట్రీట్‌మెంట్..

లేటెస్ట్ ట్రీట్‌మెంట్..

ప్రస్తుతం వాల్వ్ (కవాటాల)కు వచ్చే సమస్యలకు సర్జరీ కంటే ట్రీట్‌మెంట్ చేయడానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఎందుకంటే.. వాల్వ్స్‌ని రీప్లేస్ చేయడం కంటే ఉన్న వాల్వ్ ఎప్పుడు మంచిది కావడం వల్ల ఇప్పుడు వైద్యనిపుణులు రిపేర్‌కి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. పైగా ఉన్నవాల్వ్‌కి ట్రీట్‌మెంట్ చేసిన సందర్భాల్లో జివితాంతం వాడాల్సిన ఎసిట్రోమ్ (రక్తాన్నిపలుచబరిచేమందు) ఇవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టే ఇప్పుడు ఉన్న వాల్వ్స్‌ని ప్రత్యేకంగా మైట్రల్, ట్రైకస్పిడ్ వాల్వ్ అయితే) రిపేర్ చేయడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు.
-Dr. G. Rama Subramanyam, Cardiovascular and Thoracic Surgeon, CARE Hospitals Banjara Hills, Ph: 040 61 65 65 65


గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *