PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

హెచ్‌డీఎఫ్‌సీకి ₹5 లక్షల ఫైన్‌ వేసిన ఆర్‌బీఐ, కారణం ఏంటో తెలుసా?


RBI Penalty on HDFC: హౌసింగ్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు (HDFC) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) షాక్‌ ఇచ్చింది. నేషనల్ హౌసింగ్ బ్యాంక్‌ (NHB) జారీ చేసిన “నేషనల్‌ ఫైనాన్స్‌ కంపెనీస్‌ (NHB) నిబంధనలు – 2010″ని పాటించనందుకు HDFC పై ఐదు లక్షల రూపాయల జరిమానా విధించింది.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుక్రవారం ఈ విషయాన్ని వెల్లడించింది. మార్చి 31, 2022 నాటికి ఈ కంపెనీ ఆర్థిక స్థితి ఆధారంగా తనిఖీని నిర్వహించామని, కొన్ని నిబంధనలు పాటించడంలో HDFC విఫలమైంది RBI తెలిపింది. 

డిపాజిట్‌దార్లకు సొమ్ము చెల్లించడంలో HDFC విఫలం
2019-20లో కొంత మంది డిపాజిటర్ల మెచ్యూర్డ్ డిపాజిట్లను కంపెనీ వారి నిర్దేశిత బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయలేకపోయినట్లు తనిఖీలో వెల్లడైందని తన ప్రకటనలో ఆర్‌బీఐ తెలిపింది. లోపాలను కనిపెట్టిన తర్వాత, దానిపై పెనాల్టీ ఎందుకు విధించకూడదో చెప్పాలంటూ HDFCకి షోకాజ్ నోటీసు జారీ చేసింది. 

“కంపెనీ నుంచి వచ్చిన సమాధానాన్ని పరిగణనలోకి తీసుకున్న తర్వాత, రిజర్వ్ బ్యాంక్ నిబంధనలకు అనుగుణంగా సమాధానం రాలేదని నిర్ధరించి, జరిమానా విధించాలని నిర్ణయం తీసుకున్నాం” అని RBI పేర్కొంది. 

ఐజీహెచ్‌ హోల్డింగ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ మీద కూడా పెనాల్టీ
ఐజీహెచ్‌ హోల్డింగ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (IGH Holdings Private Limited) కూడా రిజర్వ్‌ బ్యాంక్‌ జరిమానాను ఎదుర్కొంది. ఈ సంస్థకు రూ. 11.25 లక్షల ఫైన్‌ వేసింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను, లాభనష్టాల ఖాతాలో వెల్లడించిన నికర లాభంలో 20 శాతాన్ని రిజర్వ్ ఫండ్‌కు బదిలీ చేయాలనే చట్టబద్ధమైన నిబంధనను పాటించడంలో ఈ కంపెనీ విఫలమైందని తనిఖీలో వెల్లడైంది. HDFC విఫలమైన నిబంధనల విషయంలోనే ఐజీహెచ్‌ హోల్డింగ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కూడా విఫలమైంది.

నిబంధనలు పాటించనందుకు ఐజీహెచ్‌ హోల్డింగ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు కూడా రిజర్వ్‌ బ్యాంక్ షోకాజ్‌ నోటీసు జారీ చేసింది. ఈ కంపెనీ ఇచ్చిన ప్రత్యుత్తరాన్ని పరిశీలించిన తర్వాత, ఆర్‌బీఐ చట్టం, ఆదేశాల్లో పేర్కొన్న నిబంధనలకు అనుగుణంగా కంపెనీ నడవడిక లేదని తేల్చింది. నిబంధనలకు అనుగుణంగా లేని కారణంగా ఈ సంస్థ మీద మేరకు కంపెనీ మీద రూ. 11.25 లక్షల జరిమానా విధించింది.

గతంలో అమెజాన్‌పై కూడా ఆర్‌బీఐ జరిమానా
బ్యాంకింగ్ రంగ నియంత్రణ సంస్థ అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఈ-కామర్స్ దిగ్గజ కంపెనీ అమెజాన్ పే (ఇండియా) లిమిటెడ్‌ మీద ఇటీవలే రూ. 3 కోట్లకు పైగా జరిమానా విధించింది. KYC (నో యువర్ కస్టమర్) నిబంధనలను ఈ కంపెనీ పాటించడం లేదని, అందుకే జరిమానా విధించినట్లు RBI తెలిపింది. ప్రీ-పెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్స్ నిబంధనలను అమెజాన్ పాటించడం లేదని రిజర్వ్‌ బ్యాంక్‌ వెల్లడించింది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.



Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *