ఇండియన్ చీఫ్ ప్రీమియం క్రూయిజర్ మోటార్‌సైకిల్ మార్కెట్లో 100 సంవత్సరాలను పూర్తి చేసుకున్న సందర్భంగా, కంపెనీ ఇప్పుడు మూడు కొత్త వేరియంట్లను ఈ మోడల్ లైనప్‌లో చేర్చింది. ఇందులో చీఫ్ డార్క్ హార్స్, చీఫ్ బాబర్ డార్క్ హార్స్ మరియు సూపర్ చీఫ్ లిమిటెడ్ మోడళ్లను ఇండియన్ చీఫ్ వేరియంట్ లైనప్‌లో చేర్చారు.

ఈ మూడు వేరియంట్లు కూడా ఒకే ప్లాట్‌ఫాంపై ఆధారపడి తయారు చేయబడ్డాయి. అయితే, వేరియంట్‌ను బట్టి అందులో లభించే ఫీచర్లు మరియు డిజైన్లలో స్వల్ప మార్పులు ఉంటాయి. ఈ మూడు ఇండియన్ ఛీఫ్ వేరియంట్లలో లభించే ఇంజన్ కూడా ఒకేలా ఉంటుంది.

ఇండియన్ చీఫ్ డార్క్ హార్స్, చీఫ్ బాబర్ డార్క్ హార్స్ మరియు సూపర్ చీఫ్ లిమిటెడ్ మోడళ్లలో 1890సీసీ థండర్ స్ట్రోక్ 116 ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 162 న్యూటన్ మీటర్ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. చీఫ్ మరియు చీఫ్ బాబర్ డార్క్ హార్స్ మోడళ్లలో ఈ ఇంజన్ గ్లోస్ బ్లాక్ ఫినిషింగ్‌లో ఉంటుంది. కాగా, సూపర్ చీఫ్ లిమిటెడ్ మోడల్లో మాత్రం క్రోమ్ ఫినిషింగ్‌తో లభిస్తుంది.

వీటికి అదనంగా, ప్రతి మోడల్లో ఇండియన్ బ్రాండ్ యొక్క రైడ్ కమాండ్ సిస్టమ్ ఉంటుంది. ఈ సిస్టమ్ ద్వారా రైడర్ తమ బైక్ మరియు రైడ్‌కు సంబంధించిన సమాచారాన్ని యాక్సెస్ చేయడానికి, టర్న్-బై-టర్న్ నావిగేషన్ పొందేందుకు తమ స్మార్ట్ఫోన్లను జత చేయడానికి మరియు వివిధ రకాల ఫంక్షన్లను యాక్సెస్ చేయడానికి సహకరిస్తుంది.

ఇండియన్ చీఫ్ డార్క్ హార్స్
ఇండియన్ మోటార్‌సైకిల్స్ విడుదల చేసిన చీఫ్ డార్క్ హార్స్‌లో డ్రాగ్ హ్యాండిల్బార్లు, 19 ఇంచ్ అల్లాయ్ వీల్స్, మిడ్సెట్ ఫుట్ పెగ్స్ మరియు సోలో బాబర్ సీట్ ఫీచర్లు ఉన్నాయి. ఇది థ్రోటల్-బై-వైర్, క్రూయిజ్ కంట్రోల్, ఏబిఎస్ వంటి ఫీచర్లను స్టాండర్డ్‌గా కలిగి ఉంటుంది.

అమెరికా మార్కెట్లో ఇండియన్ చీఫ్ డార్క్ హార్స్ ధర 16,999 డాలర్లుగా ఉంది. అంటే మన దేశ కరెన్సీలో సుమారు రూ.12.38 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ ప్రీమియం క్రూయిజర్ మోటార్‌సైకిల్ బ్లాక్ స్మోక్, అల్యూమినా జాడే స్మోక్ మరియు స్టీల్త్ గ్రే కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

ఇండియన్ చీఫ్ బాబర్ డార్క్ హార్స్
ఈ వేరియంట్ పేరు సూచించినట్లుగానే చీఫ్ బాబర్ డార్క్ హార్స్‌లో చాలా బ్లాక్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఇతర వేరియంట్ల నుండి ఈ వేరియంట్‌ను భిన్నంగా ఉంచేందుకు దీనిని బ్లాక్ కలర్ స్కీమ్‌లో పెయింట్ చేశారు. మార్కెట్లో దీని ధర 18,999 డాలర్లు, అంటే మన కరెన్సీలో సుమారు రూ.13.83 లక్షలు (ఎక్స్-షోరూమ్).

ఇండియన్ సూపర్ చీఫ్ మరియు సూపర్ చీఫ్ లిమిటెడ్
ఇండియన్ సూపర్ చీఫ్ చూడటానికి పైన పేర్కొన్న ఇతర వేరియంట్ల మాదిరిగానే ఉన్నప్పటికీ, ఇది ఇండియన్ సిరీస్ లైనప్‌లో కొత్తగా వచ్చిన వేరియంట్. ఇతర వేరియంట్ల మాదిరిగా కాకుండా, సూపర్ చీఫ్ టూరింగ్ మోటార్‌సైకిల్ డిజైన్‌ను కలిగి ఉంటుంది.

క్విక్-రిలీజ్ విండ్‌స్క్రీన్, లెదర్ సాడిల్ బ్యాగ్స్, టూ-అప్ టూరింగ్ సీట్లు, ఫ్లోర్‌బోర్డులు మరియు ట్రెడిషనల్ వైడ్ క్రూయిజర్ హ్యాండిల్బార్లు వంటి ఫీచర్లను ప్రధానంగా ఈ సూపర్ చీఫ్ మరియు సూపర్ చీఫ్ లిమిటెడ్ మోడళ్లలో అందిస్తున్నారు.

సూపర్ చీఫ్ ధర, అమెరికన్ మార్కెట్లో సూపర్ ఛీఫ్ ధర 18,499 డాలర్లు (సుమారు రూ.13.47 లక్షలు) మరియు సూపర్ చీఫ్ లిమిటెడ్ ధర 20,999 డాలర్లు సుమారు (రూ.15.29 లక్షలు)గా ఉన్నాయి (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్).