ఆర్థరైటిస్ ఉన్న‌వారికి న‌డ‌క వ‌ల‌న ఉప‌యోగాలు

10,000 Steps a day: ఓ హెల్త్ డివైజ్ ప్రకటన ప్రకారం రోజుకు 10వేల అడుగులు నడిస్తే ఆరోగ్యానికి మంచిదనే ప్రచారం ఊపందుకుంది. యమసా టోకీ అనే జపనీస్ కంపెనీ 1965లో మొదటి వాణిజ్య పెడోమీటర్‌ను పరిచయం చేసినప్పుడు.. దీన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చింది. మాన్‌పో-కీ అని ఈ పరికరాన్ని పిలుస్తారు, అంటే “10,000-దశల మీటర్”. అయితే రోజుకు ’10వేల అడుగులు’ వేయాలి అనే నియమం.. ఎంతవరకు శాస్త్రీయం అనేది సదరు సంస్థ ఇప్పటివరకు వెల్లడించలేదు. అసలు దీనిలో వాస్తవాలు? అపోహల గురించి ఈ స్టోరీలో చూద్దాం.
రోజూ వాకింగ్ చేస్తే ఈ ప్రయోజనాలు ఉంటాయ్..


రోజుకు 10,000 అడుగులు నడిస్తే డిమెన్షియా, క్యాన్సర్, అకాల మరణాల ముప్పు తగ్గిస్తుందని JAMA ఇంటర్నల్ మెడిసిన్‌, JAMA న్యూరాలజీ జర్నల్‌ ప్రచురించింది. ఈ అధ్యయనం UK బయోబ్యాంక్ నుంచి 40 , 79 ఏళ్ల మధ్య వయస్సు గల 78,500 మంది డేటా సేకరించింది. రోజూ నడిస్తే.. గుండె జబ్బులు, స్టోక్‌ ముప్పు తగ్గుతుంది. నడక వల్ల డయాబెటిస్‌, అధిక కొలెస్ట్రాల్‌, కీళ్లు, కండరాల అసౌకర్యం, హైపర్‌టెన్షన్‌ వంటి సమస్యలు కంట్రోల్‌లో ఉంటాయి.
రెగ్యులర్ వాకింగ్ ఎముకలను బలోపేతం చేస్తుంది, సమతుల్యతను మెరుగుపరుస్తుంది. కండరాల బలం మరియు ఓర్పును పెంచుతుంది. శరీరంలో కొవ్వును కరిగించి హెల్తీ వెయిట్‌ను మెయింటేన్‌ చేస్తుంది. అందుకే డైలీ రొటీన్‌ వాకింగ్‌ను ఒక భాగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు.
రోజుకు 10,000 అడుగులు వేస్తే.. మంచిదేనా..?

walking


రోజుకు 10,000 అడుగులు వేస్తే.. గుండె జబ్బులు, 13 రకాల క్యాన్సర్లు, డిమెన్షియా ముప్పు తగ్గుతుందని 2022లో నిర్వహించిన ఓ పరిశోధనలో తేలింది. 10,000 కంటే తక్కువ అడుగులు నిడిచినా.. అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని అధ్యయనాలు చెబుతున్నారు. రోజుకు 9,800 అడుగులు వేస్తే.. డిమెన్షియా ముప్పు 50 శాతం తగ్గుతుంది, రోజుకు కేవలం 3,800 అడుగులు వేస్తే.. డిమెన్షియా (చిత్తవైకల్యం) ముప్పు 25 % తగ్గుతుంది. ఈ అధ్యయనంలో సుమారు 78,500 మంది మధ్య వయస్కులు, వృద్ధులు తమ మణికట్టుపై ఏడేళ్లపాటు పరికరాన్ని ధరించారు. ఇంకా వేగంగా నడిస్తే.. ఆరోగ్య ప్రయోజనాలు పెరుగుతాయని అధ్యయనంలో తేలింది.
రోజుకు కనీసం 10,000 అడుగులు నడిస్తే.. అనేక ఆరోగ్యప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు అంటున్నారు. అధ్యయనాల ప్రకారం, సగటు వ్యక్తి రోజూ 5,000 నుంచి 7,500 అడుగులు వేస్తారు, వారు ఎక్కువగా నిశ్చల జీవనశైలిని గడుపుతున్నప్పటికీ. అయితే, మీ దినచర్యకు 30 నిమిషాల నడకను జోడించడం వల్ల అదనంగా 3,000 నుంచి 4,000 అడుగులను జోడించవచ్చు. మీరు మెల్లగా.. 10,000 అడుగల లక్ష్యాన్ని చేరుకోవచ్చు. కానీ, 10,000 అడుగులు మ్యాజికల్‌ నంబర్‌ కాదు. మీ వాకింగ్‌ స్టెప్స్‌ పెరిగే కొద్దీ.. కార్డియోవాస్కులర్ ముప్పు తగ్గుతుంది.

walking

మీరు థ్రెషోల్డ్‌ను సెట్ చేయడానికి ఆసక్తిగా ఉంటే, కొన్ని అధ్యయనాల ప్రకారం రోజుకు 7000 అడుగులు నడవడం అనేది కనీస కార్యాచరణ స్థాయి. నడక అనేది వ్యాయామంలో భాగం మాత్రమే, ఇది దివ్యౌషధం కాదని అర్థం చేసుకోవడం చాలా అవసరం. రెగ్యులర్ వాకింగ్ నిజంగా హృదయ ఆరోగ్యానికి, కండరాల బలం, బరువు కంట్రోల్‌లో ఉంచుకోవడానికి అవసరం. అయినప్పటికీ, ఫిట్‌నెస్, ఆరోగ్యానికి సమతుల్య విధానాన్ని నిర్వహించడం, ఇతర రకాల వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారం, లైఫ్‌స్టైల్‌ అలవాట్లు చాలా అవసరం.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *