Thursday, June 17, 2021

14 ఏళ్ల బాలుడితో గర్భం దాల్చిన మహిళ… ఏడాదిగా సంబంధం… లైంగిక దాడి కేసు నమోదు…

International

oi-Srinivas Mittapalli

|

అమెరికాలో దారుణం వెలుగుచూసింది. 23 ఏళ్ల ఓ మహిళ 14 ఏళ్ల బాలుడితో ఏడాది కాలంగా లైంగిక సంబంధం కొనసాగిస్తోంది. ఇటీవల ఆమె గర్భం కూడా దాల్చింది. ఈ వ్యవహారం బయటకు పొక్కడంతో ఆమెపై చర్యలు తప్పలేదు. మైనర్ బాలుడిపై లైంగిక దాడికి గురైందన్న ఆరోపణలతో ఆమెపై కేసు నమోదైంది.

వివరాల్లోకి వెళ్తే… అమెరికాలోని అర్కాన్సాస్‌కి చెందిన బ్రిట్నీ గ్రే(23) 14 ఏళ్ల బాలుడితో లైంగిక సంబంధం పెట్టుకుంది. ఈ ఇద్దరూ తరుచూ ఆమె ఇంట్లో కలుస్తూ లైంగిక కార్యకలాపాలు సాగిస్తున్నారు. గతేడాది ఫిబ్రవరి 28న ఓ వ్యక్తి చైల్డ్ అబ్యూజ్ హాట్‌లైన్‌కి ఫోన్ చేసి అధికారులకు దీనిపై సమాచారం అందించాడు.

గతేడాది సెప్టెంబర్‌లో మరో వ్యక్తి పోలీసులకు ఫోన్ చేసి ఇదే విషయాన్ని చెప్పాడు. గ్రే అనే మహిళ ఓ మైనర్ బాలుడితో లైంగిక సంబంధం కొనసాగిస్తోందని చెప్పాడు. దీంతో ఆ వ్యక్తిని విచారించిన పోలీసులు మరిన్ని వివరాలు రాబట్టారు. అతను చెప్పింది నిజమేనని నిర్దారించుకున్న తర్వాత నేరుగా రంగంలోకి దిగారు.

ఈ క్రమంలో గ్రే,ఆ బాలుడు కలిసి ఓ ఆస్పత్రికి వెళ్లిన సీసీటీవీ ఫుటేజీని సేకరించారు. అక్కడి వైద్యులు తెలిపిన వివరాల మేరకు ప్రస్తుతం ఆమె గర్భవతి అని,బాలుడితో సంబంధం కారణంగానే గర్భం దాల్చిందని తెలుసుకున్నారు. దీంతో మార్చి 1న పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. మైనర్ బాలుడిపై లైంగిక దాడికి పాల్పడిందన్న అభియోగాల కింద ఆమెపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

గతంలోనూ అమెరికాలో ఇలాంటి కేసులు వెలుగుచూశాయి. కొన్నేళ్ల క్రితం మెలిసా ఆండ్రేనీ అనే ఒక టీచర్ 15 ఏళ్ల టీనేజ్ విద్యార్థితో లైంగిక సంబంధం పెట్టుకున్న ఘటన వెలుగుచూసింది. ఈ కేసులో అరెస్టయిన ఆమె ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తోంది.


Source link

MORE Articles

Report: Ring provided at least 100 LAPD officers with free devices or discount codes and encouraged them to recommend its products to fellow LAPD...

Johana Bhuiyan / Los Angeles Times: Report: Ring provided at least 100 LAPD officers with free devices or discount codes and encouraged them...

హైకోర్టుకు చేరిన గెలుపు పంచాయతీ: సువేంద్ విక్టరీపై కోర్టులో మమతా సవాల్

పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై బీజేపీ నేత సువేందు అధికారి గెలుపొందిన సంగతి తెలిసిందే. ఊగిసిలాట మధ్య స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. అయితే న్నికల ఫలితాలను సవాల్‌ చేస్తూ...

శభాష్ హర్లీ.. నదిలో కొట్టుకుపోతున్న జింక పిల్లను కాపాడి.. నెటిజన్ల ప్రశంసలు

కనిపించని హర్లీ.. అమెరికాలో హర్లీ అనే శునకాన్ని పెంచుకుంటున్నారు. అయితే అదీ ఈ నెల మొదటి వారం నుంచి కనిపించడం లేదు. దీంతో యజమాని కంగారు పడ్డారు....

इस समस्या से जूझ रहे पुरुष करें कद्दू के बीज का सेवन, मिलेंगे गजब के फायदे!

नई दिल्ली: अगर आप शुगर पेशेंट हैं या फिर शारीरिक कमजोरी से जूझ रहे हैं तो ये खबर आपके काम की है. इस...

43 కిలోల బంగారం స్వాధీనం.. రూ.21 కోట్లు విలువ.. ఇక్కడే

మణిపూర్‌లో భారీగా బంగారం పట్టుబడింది. ఇంఫాల్‌లో డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ అధికారులు చేసిన తనిఖీల్లో ఏకంగా రూ.21 కోట్లు విలువ చేసే గోల్డ్ స్వాధీనం చేసుకున్నారు. అదీ మొత్తం 43 కిలోలు...

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో గ్యాస్ లీకేజీ: తీవ్ర అస్వస్థతో ఒకరు మృతి, ఆస్పత్రిలో మరో ఇద్దరు

హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయం(రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం)లో గ్యాస్ పైప్ లీకైంది. దీంతో అక్కడే ఉన్న ముగ్గురు వ్యక్తులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. నర్సింహా రెడ్డి అనే...

Woman: బాలుడి ప్రాణం పోయింది, మంత్రగత్తె అని ముస్లీం మహిళను చితకబాదేసి, ఇంట్లో నుంచి లాగి !

మంత్రాలు వేస్తున్న మంత్రగత్తె ? రాజస్థాన్ లోని బుండి జిల్లాలోని భజన్రి అనే గ్రామంలో ఓ ముస్లీం మహిళ నివాసం ఉంటున్నది. ముస్లీం మహిళ మంత్రాలు వేస్తోందని...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe