Saturday, May 8, 2021

150 మందికి పైగా జలసమాధి?: మృతుల సంఖ్య మరింత: మట్టికుప్పగా కుగ్రామం: సీఎం సందర్శన


National

oi-Chandrasekhar Rao

|

డెహ్రాడూన్: దేవభూమిగా పేరున్న ఉత్తరాకండ్.. మరోసారి మరుభూమిగా మారింది. చమోలీ జిల్లాలో అనూహ్యంగా చోటు చేసుకున్న వరదల బారిన పడి కనీసం 150 మంది మరణించి ఉండొచ్చని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ సంఖ్య మరింత పెరిగే ప్రమాదం లేకపోలేదంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంఘటన చోటు చేసుకున్న తరువాత 300 మందికి పైగా గల్లంతయ్యారని, వారిలో కొందరు సురక్షితంగా బయటపడినట్లు సమాచారం అందిందని చెప్పారు.100 నుంచి 150 మంది వరకు ఫ్లాష్ ఫ్లడ్ బారిన పడి మరణించి ఉంటారని పేర్కొన్నారు.

ఉత్తరాఖండ్ చమోలీ జిల్లాలోని తపోవన్ ప్రాంతం గుండా ప్రవహిస్తోన్న ధౌలిగంగా నదికి అకస్మాత్తుగా వరద ప్రవాహం పెరగడం వల్ల దాని మీద నిర్మిస్తోన్న ఆనకట్ట తెగిపోయింది. 24 మెగావాట్ల ఉత్పాదక సామర్థ్యంతో తపోవన్ జల విద్యుత్ కేంద్రం నిర్మాణ పనుల్లో నిమగ్నమైన ఉన్న కార్మికులందరూ ఈ ఘటనలో గల్లంతయ్యారు. ఆనకట్ట తెగడం వల్ల దిగువకు ప్రవహించిన ధౌలిగంగ జలాలు రైనీ గ్రామాన్ని ముంచెత్తాయి. వరద నీటి ప్రవాహానికి పలు నివాసాలు కొట్టుకెళ్లాయి. పదుల సంఖ్యలో స్థానికులు గల్లంతు అయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలను పర్యవేక్షించారు.

Uttarakhand Flash floods: 100-150 casualties feared in Chamoli district: CS Om Prakash

చమోలీ జిల్లాలో విస్తరించిన నందా దేవి జాతీయ పార్క్‌లో కొండ చరియలు విరిగి పడటం వల్ల ధౌలిగంగా నదికి ఒక్కసారిగా ప్రవాహం పెరిగింది. ఈ ప్రవాహ ఉధృతిని, నదీ జలాల తాకిడికి తపోవన్ హైడల్ ప్రాజెక్ట్, ఆనకట్ట నిలువలేకపోయాయి. అట్టముక్కలా తెగిపోయాయి. ఈ సమాచారం అందుకున్న వెంటనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. పెద్దఎత్తున సహాయక చర్యలను చేపట్టాయి. గల్లంతైన వారి కోసం గాలిస్తున్నాయి. దీనికోసం వైమానిక దళం నుంచి హెలికాప్టర్లను రప్పించారు. ఐటీబీపీ జవాన్లు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాలు ఇందులో భాగస్వామ్యం అయ్యాయి.

సహాయక చర్యలను పర్యవేక్షించడానికి ఉత్తరాఖండ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఓం ప్రకాష్ సంఘటనా స్థలానికి బయలుదేరి వెళ్లారు. చమోలి జిల్లా కేంద్రంలో ఆయన మకాం వేశారు. సహాయక చర్యల గురించి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని తెప్పించుకుంటున్నారు. వీలైనంత మేర ప్రాణనష్టాన్ని నివరించడానికి అవసరమైన అన్ని చర్యలను చేపట్టామని ఆయన వెల్లడించారు. అయినప్పటికీ.. 100 నుంచి 150 మంది మరణించి ఉండొచ్చని ప్రాథమికంగా నిర్దారించినట్లు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం లేకపోలేదని చెప్పారు.Source link

MORE Articles

తెలంగాణలో కొత్తగా 5186 కరోనా కేసులు.. మరో 38 మంది మృతి…

తెలంగాణలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 5186 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 38 మంది కరోనాతో ప్రాణాలు విడిచారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ...

वजन कम करने से लेकर आंखों तक के लिए फायदेमंद है धनिया का पानी, इस तरह करें सेवन, मिलेंगे 12 गजब के फायदे

नई दिल्ली: आज हम आपके लिए लेकर आए हैं धनिया के पानी से होने वाले फायदे..धनिया हर घर के किचन में आराम से...

అడ్వకేట్ వామన్‌రావు దంపతుల హత్య కేసులో మాజీ మంత్రి పాత్ర… తెర పైకి సంచలన ఆరోపణలు…

కిషన్ రావు సంచలన ఆరోపణలు... నిజానికి చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతూ ఆస్పత్రిలో చేరిన తర్వాత వామన్‌రావుకు వైద్యం అందలేదని కిషన్ రావు ఆరోపించారు. ఆయనకు మందులు...

నారా లోకేష్ పై క్రిమినల్ కేసు నమోదు.. లోకేష్ ఆ ట్వీట్ పై అనంతలో వైఎస్సార్సీపీ నేత ఫిర్యాదు

అనంత‌పురం జిల్లా రాయ‌దుర్గం టిడిపి కార్య‌క‌ర్త మారుతి‌, సోష‌ల్‌మీడియా వేదిక‌గా ఎమ్మెల్యే అవినీతి అరాచ‌కాల‌ను ప్ర‌శ్నిస్తున్నార‌ని గూండాల‌తో దాడి చేయించారు.(1/3) pic.twitter.com/T8aedmlfm6 — Lokesh...

ఆ గ్రామంలో ఒక్క కరోనా కేసు కూడా లేదు, కుగ్రామమే అయినా కరోనా కట్టడిలో సక్సెస్..కారణం ఇదే !!

జగిత్యాల జిల్లాలోని రాగోజిపేట్ లో ఒక్క కరోనా కేసు కూడా లేదు కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతున్న సమయంలో జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఇబ్బడిముబ్బడిగా కరోనా...

कब खत्म होगी कोरोना की दूसरी लहर? वैज्ञानिकों ने बताया सही टाइम…जानें

नई दिल्ली: इस वक्त कोरोना की दूसरी लहर ने देश में कोहराम मचा रखा है. रोजाना रिकॉर्ड मामले सामने आ रहे हैं. हजारों...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe