PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

18,400 వద్ద నిఫ్టీ ట్రేడింగ్‌ – అదానీ కంపెనీలే టాప్‌!

[ad_1]

Stock Market @12 PM, 23 May 2023: 

స్టాక్‌ మార్కెట్లు మంగళవారం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందాయి. వరుసగా మూడో రోజు అదానీ కంపెనీల షేర్లు యాక్టివ్‌గా ట్రేడవుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 85 పాయింట్లు పెరిగి 18,399 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 221 పాయింట్లు పెరిగి 62,184 వద్ద కొనసాగుతున్నాయి.

BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)

క్రితం సెషన్లో 61,963 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 62,098 వద్ద మొదలైంది. 62,061 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 62,245 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మధ్యాహ్నం 12 గంటలకు 221 పాయింట్ల లాభంతో 62,184 వద్ద కొనసాగుతోంది.

NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)

సోమవారం 18,314 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మంగళవారం 18,362 వద్ద ఓపెనైంది. 18,349 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,413 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 85 పాయింట్లు పెరిగి 18,399 వద్ద ట్రేడవుతోంది.

Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)

నిఫ్టీ బ్యాంక్‌ లాభపడింది. ఉదయం 43,978 వద్ద మొదలైంది. 43,861 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 44,084 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మధ్యాహ్నం 98 పాయింట్లు పెరిగి 43,983 వద్ద కొనసాగుతోంది.

Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)

నిఫ్టీ 50లో 39 కంపెనీలు లాభాల్లో 11 నష్టాల్లో ఉన్నాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, దివిస్ ల్యాబ్‌, అదానీ పోర్ట్స్‌, బజాజ్ ఫిన్‌సర్వ్‌, బీపీసీఎల్‌ షేర్లు లాభపడ్డాయి. కొటక్‌ బ్యాంక్‌, గ్రాసిమ్‌, ఎల్‌టీ, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, ఓఎన్‌జీసీ షేర్లు నష్టపోయాయి. అన్ని రంగాల సూచీలు ఎగిశాయి. ఆటో, ఐటీ, మెటల్‌, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంకు, ఆయిల్‌ అండ్‌ గ్యాస్ సూచీలు అధికంగా లాభపడ్డాయి.

బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)

నేడు విలువైన లోహాల ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.310 తగ్గి రూ.61,100గా ఉంది. కిలో వెండి రూ.500 తగ్గి రూ.74,500 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.210 పెరిగి రూ.28,450 వద్ద కొనసాగుతోంది.

Also Read: ₹2000 నోట్ల ఉపసంహరణ వల్ల ఆర్థిక వ్యవస్థకు జరిగే నష్టం ఎంత?

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.



[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *