భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఐక్యరాజ్యసమితి శాంతి బలగాలకు రెండు లక్షల డోసుల కోవిడ్ వ్యాక్సిన్లు బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు జీఎవిఐ తదితర అంతర్జాతీయ సంస్థల్లో చురుగ్గా ఉంటోన్న భారత్ శాంతి బలగాల సేవలను దృష్టిలో ఉంచుకుని తాజా నిర్ణయం తీసుకుందని విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్ తెలిపారు. ఐక్యరాజ్యసమితి భద్రతామండలి ఓపెన్ డిబేట్ సందర్భంగా జై శంకర్ ఆ ప్రకటన చేశారు. సార్క్ కోవిడ్-19 ఎమర్సెన్సీ ఫండ్ కోసం భారత్ గట్టిగా మద్దతిచ్చిన విషయాన్ని జై శంకర్ గుర్తు చేశారు. భారత్ ఇప్పటికే 25 దేశాలకు మేడిన్ ఇండియా కోవిడ్ వ్యాక్సిన్లు పంపిందని చెప్పారు. మరో 49 దేశాలకు పంపేందుకు సిద్ధంగా ఉందన్నారు.