ప్రగతికి అవసరమైన నాలుగు ప్రధాన అంశాలను ఆధారంగా చేసుకొని 2023-24 సంవత్సరానికి ఏపీ బడ్జెట్ కోసం కేటాయింపులు చేసినట్టు పేర్కొన్నారు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. సుస్థిర అభివృద్ధి, జవాబుదారీతనం, ప్రతిస్పందన, పారదర్శకత సమాన అవకాశాలతో కూడీన  సుపరిపాలనకు దారి తీస్తుందన్నారు బుగ్గన. తమ పార్టీ మేనిఫెస్టోనే ఆ సూత్రాలకు అనుగుణంగా రూపొందించిందని గుర్తు చేశారు. అందుకే స్థిరమైన అభివృద్ధితో దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా ఉందని చెప్పారు.

2 లక్షల  79  వేల కోట్ల అంచనాలతో రూపొందించిన బడ్జెట్‌లో రెవెన్యూ లోటును  22,316 కోట్ల రూపాయలుగా చూపించారు. అదే టైంలో రెవెన్యూ వ్యయాన్ని 2,28,540 కోట్లగా పేర్కొన్నారు. మూలధన వ్యయం 31,061 కోట్లు అయితే.. ద్రవ్య లోటు 54,587 కోట్ల రూపాయలగే అంచనా వేశారు. జీఎస్డీపీలో రెవెన్యూ లోటు 3.77 శాతం ఉంటే… ద్రవ్య లోటు 1.54 శాతంగా ఉంటుందని లెక్క కట్టారు.

బడ్జెట్ సంక్షిప్త రూపం

 • మొత్తం బడ్జెట్‌- రూ. 2 లక్షల 79వేల 279 కోట్లు
 • రెవెన్యూలోటు- రూ. 22,316 కోట్లు
 • రెవెన్యూ వ్యయం- రూ. 2,28,540 కోట్లు
 • మూలధన వ్యయం- రూ. 31,061 కోట్లు
 • ద్రవ్య లోటు – రూ. 54,587 కోట్లు
 • జీఎస్డీపీలో రెవెన్యూ లోటు 3.77శాతం
 • జీఎస్డీపీలో ద్రవ్య లోటు 1.54 శాతం

 2023-24 బడ్జెట్‌లో బుగ్గనరాజేంద్రనాథ్ రెడ్డి వివిధ శాఖలకు కేటాయించిన నిధులు ఇలా ఉన్నాయి.

 • వ్యవసాయ శాఖ- రూ. 11589.48 కోట్లు 
 • సెకండరీ ఎడ్యుకేషన్‌- రూ. 29,690.71 కోట్లు
 • వైద్యారోగ్య శాఖ- రూ. 15,882.34 కోట్లు
 • పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి- రూ. 15,873 కోట్లు 
 • ట్రాన్స్‌పోర్ట్‌, ఆర్‌ అండ్‌ బీ- రూ. 9,118.71 కోట్లు
 • విద్యుత్ శాఖ- రూ.  6546.21 కోట్లు 

వివిధ కార్పొరేషన్లకు కేటాయింపులు ఇలా ఉన్నాయి. 

 • ఎస్సీ కార్పొరేషన్- రూ. 8384.93 కోట్లు 
 • ఎస్టీ కార్పొరేషన్- రూ. 2428 కోట్లు 
 • బీసీ కార్పొరేషన్- రూ. 22,715 కోట్లు 
 • ఈబీసీ కార్పొరేషన్- రూ. 6165 కోట్లు 
 • కాపు కార్పొరేషన్- రూ. 4887 కోట్లు
 • క్రిస్టియన్ కార్పొరేషన్- రూ. 115.03 కోట్లు 

సంక్షేమ పథకాలకు కేటాయించిన నిధులు ఇలా ఉన్నాయి. 

 • వైఎస్సార్‌ రైతు భరోసా -రూ.4,020 కోట్లు
 • వైఎస్సార్‌ పీఎం బీమా యోజన- రూ.1600 కోట్లు
 • రైతులకు వడ్డీలేని రుణాలు -రూ.500 కోట్లు
 • ధర స్థిరీకరణ నిధి- రూ.3,000 కోట్లు
 • వ్యవసాయ యాంత్రీకరణ -రూ. 1,212 కోట్లు
 • డీబీటీ స్కీంలు – రూ.54,228.36 కోట్లు
 • అమ్మ ఒడి ఫథకం- రూ.6,500 కోట్లు
 • వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక‍- రూ.21,434.72 కోట్లు
 • జగనన్న విద్యాదీవెన -రూ.2,841.64 కోట్లు
 • జగనన్న వసతి దీవెన- రూ.2,200 కోట్లు
 • డ్వాక్రా సంఘాలకు వడ్డీలేని రుణాలు- రూ.1,000 కోట్లు
 • వైఎస్సార్‌ కాపు నేస్తం- రూ. 550 కోట్లు
 • జగనన్న చేదోడు -రూ.350 కోట్లు
 • వైఎస్సార్‌ వాహనమిత్ర -రూ.275 కోట్లు
 • వైఎస్సార్‌ నేతన్న నేస్తం -రూ.200 కోట్లు
 •  వైఎస్సార్‌ మత్స్యకార భరోసా -రూ.125 కోట్లు

విభజన సమస్యలకు తోడు కరోనా రూపంలో కూడా రాష్ట్రంలో ఆర్థికంగా చాలా నష్టపోయిందని… ఈ టైంలో ఎన్నో సమస్యలు రాష్ట్రం ఎదుర్కొందన్నారు బుగ్గన. వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఆర్థిక శాఖ రాత్రిపగలు శ్రమించిందని వెల్లడించారు. తనకు నాలుగేళ్లుగా సహకరిస్తూ వస్తున్న ఆర్థిక శాఖాధికారలకు ఆయన కృతజ్ఞత తెలిపారు. 

బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తన పూర్తి స్థాయి ఆఖరు బడ్జెట్ ఇది. 2024లో ఈ ప్రభుత్వం ప్రవేశ పెట్టేది తాత్కాలిక బడ్జెటే. అప్పటికే ఎన్నికలు ఇంకా ఆరు నెలలు కూడా సమయం ఉండబోదు. అందుకే ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్ ప్రవేశ పెట్టి ఎన్నికలు వెళ్లనున్నారు. అంటే ఈ లెక్క ఇదే ఈ ప్రభుత్వానికి, ఆర్థిక మంత్రిగా ఉన్న బుగ్గన రాజేంద్రనాథ్‌కు ఈ దఫాకు ఆఖరి పూర్తి స్థాయి బడ్జెట్‌ అవ్వనుంది. Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *