డిసెంబర్ థర్టీ ఫస్ట్ కోసం అంతా ఎదురు చూస్తుంటారు. ఏడాది మొత్తం ఎలా ఉన్నా ఆరోజు రాత్రి బాగా ఎంజాయ్ చేయాలని ఎన్నో రోజుల నుంచి ప్లాన్స్ వేసుకుంటారు. ఇక యూత్ హంగామా మామూలుగా ఉండదు. ఇయర్ ఎండింగ్ కాబట్టి..వచ్చే ఏడాదంతా గుర్తుండిపోయేలా సెలబ్రేషన్స్ చేసుకుంటారు. ఆరోజు రాత్రి ఆన్ లైన్ లో ఫుడ్ యాప్స్ కి ఫుల్ గిరాకీ ఉంటుంది. ఈసారి వెరైటీగా డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ స్విగ్గీలో భారీగా కండోమ్స్ ఆర్డర్స్ వచ్చాయి. ఈఏడాది ఎవరూ ఊహించని విధంగా లిక్కర్, బిర్యానీ, కేకులతోపాటు కండోమ్స్ కూడా వచ్చి చేరాయి. అదేంటీ ఫుడ్ డెలివరీ యాప్ లో కండోమ్స్ సేల్స్ ఏంటని షాకయ్యారా?.

రెండున్నర నిమిషాల్లో 2757 కండోమ్స్ డెలివరీ
స్విగ్గీలో మామూలుగా బిర్యానీలు, నాన్ వెజ్ ఫుడ్, కేకులు ఆర్డర్ చేస్తుంటాం. ఈసారి ఫుడ్ వెరైటీలతోపాటు కండోమ్స్ ను డెలివరీ చేసినట్టు స్విగ్గీ తెలిపింది. 2022 ఏడాది చివరి రోజున అంటే డిసెంబర్ 31న రాత్రి 9:30 గంట‌లకు 2757 కండోమ్స్ ప్యాకెట్ల‌ను యూజ‌ర్లు ఆర్డ‌ర్ చేశార‌ని స్విగ్గీ స్వయంగా ప్రకటించింది. ఆర్డ‌ర్ చేసిన కండోమ్ ప్యాకెట్ల‌ను కేవ‌లం 2.5 నిమిషాల్లోనే డెలివ‌రీ చేసిన‌ట్లు ట్విట్టర్లో పేర్కొంది. కండోమ్స్ సూపర్ సేల్ తో స్విగ్గీ సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. 

News Reels

ఒక్క రాత్రి మూడున్నర లక్షల బిర్యానీ ఆర్డర్లు
డిసెంబ‌ర్ 31న రాత్రి 7 గంట‌ల వ‌ర‌కు లక్షా 76వేల చిప్స్ ప్యాకెట్ల‌ను కూడా ఆర్డ‌ర్ చేశారట. రాత్రి 10గంటల 25నిమిషాల వరకు ఫుడ్‌డెలివరీ సంస్థ స్విగ్గీ ఏకంగా 3లక్షల 50వేల బిర్యానీ ఆర్డర్లు డెలివరీ చేసింది. హైదరాబాద్‌ బిర్యానీకి 75.4 శాతం ఆర్డర్లు వచ్చినట్లు పేర్కొంది. లక్నోలో 14.2శాతం, కోల్ కతాలో 10.4శాతం ఆర్డర్లు వచ్చినట్టు ట్విట్టర్ వేదికగా పంచుకుంది. 

బావర్చి బిర్యానీ టాప్..నిమిషానికి రెండు డెలివరీలు
హైదరాబాద్‌లో బిర్యానీ విక్రయాల్లో బావర్చి రెస్టారెంట్ టాప్ ప్లేస్ లో నిలిచిందని తెలిపింది. ప్రతి నిమిషానికి రెండు బిర్యానీలు డెలివరీ చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. థర్టీ ఫస్ట్ కోసం ఏకంగా 15వేల కిలోల బిర్యానీ రెడీ చేసినట్టు బావర్చి మేనేజ్మెంట్ తెలిపింది.  ఇక దేశవ్యాప్తంగా రాత్రి 10.25 గంటల సమయానికి 61వేల పిజ్జాలను డెలివరీ చేసినట్లు స్విగ్గీ తెలిపింది.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *