సుజుకి హయాబుసా:
సుజుకి మోటార్ సైకిల్ కంపెనీ యొక్క శక్తివంతమైన స్పోర్ట్స్ బైక్ హయాబుసా. ఇది భారతదేశంలో బాగా ప్రాచుర్యం పొందింది. ఈ బైక్‌కు దేశీయ మార్కెట్లో మాత్రమే కాదు ప్రపంచ మార్కెట్లో కూడా అత్యధిక ఎక్కువ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. గత ఏడాది ఏప్రిల్‌లో బిఎస్ 6 ఉద్గార ప్రమాణం అమల్లోకి వచ్చిన తర్వాత కంపెనీ తన బిఎస్ 4 మోడల్ అమ్మకాన్ని నిలిపివేసింది.

అయితే కంపెనీ ఇప్పుడు దాదాపు ఒక సంవత్సరం తర్వాత, బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలను అనుకూలంగా ఈ బైక్ ని అప్డేట్ చేసి విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ బైక్‌ను 2021 ఏప్రిల్ నెలలో లాంచ్ చేయనున్నట్లు కంపెనీ ఇటీవల కొత్త టీజర్‌ను కూడా విడుదల చేసింది.
MOST READ:మాట నిలబెట్టుకున్న ఆనంద్ మహీంద్రా; థార్ ఎస్యూవీ పొందిన మహ్మద్ సిరాజ్

ఈ కొత్త సుజుకి హయాబుసా బైక్ లో అనేక అప్డేటెడ్ ఫీచర్లు కలిగి ఉండటమే కాకుండా ముఞ్చి పర్ఫామెన్స్ కూడా అందించేవిధంగా తయారుచేయబడింది. ఈ బైక్ యొక్క డిజైన్ ఇప్పుడు మరింత ఏరోడైనమిక్ గా ఉంటుంది. ఇందులో ఇప్పుడు మల్టిపుల్ డ్రైవ్ మోడ్స్ ఇవ్వబడ్డాయి.

కొత్త సుజుకి హయాబుసా బైక్ లో 4-సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజన్ ఉంటుంది, ఇది బిఎస్ 6 / యూరో 5 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా ఉంటుంది. ఈ ఇంజిన్ 200 బిహెచ్పి శక్తిని ఉత్పత్తి చేయగలదు. బైక్ యొక్క టాప్ స్పీడ్ గంటకు 228 కి.మీ వరకు ఉంటుంది.
MOST READ:మీకు తెలుసా.. ప్రపంచంలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఫైర్ ట్రక్, ఇదే

ట్రయంఫ్ ట్రైడెంట్ 660:
భారతదేశం ట్రయంఫ్ బైక్ అయిన, ట్రయంఫ్ ట్రైడెంట్ 660 కోసం చాలా కాలంగా ఎదురుచూస్తోంది. ట్రయంఫ్ ట్రైడెంట్ 660 చాలా శక్తివంతమైన మరియు పనితీరు కలిగిన బైక్. ఈ బైక్ సిబియు మార్గం ద్వారా భారత్‌లోకి దిగుమతి చేయబడుతుంది. ట్రయంఫ్ ఇండియా దీనిని 2021 ఏప్రిల్ 6 న లాంచ్ చేయనున్నట్లు తెలిపింది.

భారతదేశంలో ట్రయంఫ్ ట్రైడెంట్ 660 యొక్క ప్రీ-బుకింగ్ గత నవంబర్ నుండి ప్రారంభమైంది. ట్రైడెంట్ 660 బైక్ ని రూ. 7 లక్షల నుంచి రూ. 7.50 లక్షల మధ్య లాంచ్ చేసే అవకాశం ఉంది. ట్రయంఫ్ ట్రైడెంట్ 660 సిసి ఇన్లైన్ ట్రిపుల్ మోటారు ఇంజిన్‌ను కలిగి ఉంది, ఇది 81 బిహెచ్పి శక్తిని మరియు 61 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ కవాసకి జెడ్ 650 మరియు హోండా సిబి 650 ఆర్ వంటి వాటికీ ప్రత్యర్థిగా ఉంటుంది.
MOST READ:భర్త ఇచ్చిన గిఫ్ట్‌కి కన్నీళ్లు పెట్టుకున్న భార్య.. ఇంతకీ ఏమిచ్చాడో తెలుసా?

2021 కెటిఎం ఆర్సి 390:
ఈ నెలలో విడుదలయ్యే బైకులలో ఆస్ట్రియన్ ద్విచక్ర వాహనాల తయారీదారు కెటిఎమ్ యొక్క కొత్త కెటిఎం ఆర్సి 390 బైక్ ఒకటి. ఇటీవల కాలంలో ఈ బైక్ కి సంబంధించిన చాలా ఫోటోలు వెలువడ్డాయి. ఈ బైక్ చాలా అప్డేట్ పొంది ఉంటుంది.

ఈ బైక్ యొక్క డిజైన్ విషయానికి వస్తే, దీని హెడ్‌ల్యాంప్ చుట్టూ ట్రాన్స్పరెంట్ ఫెయిరింగ్ ఉంటుంది. ఈ బైక్‌లో 373 సిసి సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజన్ ఉంటుంది, ఇది 44 బిహెచ్పి పవర్ మరియు 35 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ చూడటానికి చాలా స్టైలిష్ గా ఉండటమే కాకుండా చాలా అప్డేట్ ఫీచర్స్ కలిగి ఉండటం వల్ల మంచి పనితీరుని కలిగి ఉంటుంది.

టీవీఎస్ అపాచీ ఆర్ఆర్ 310:
ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ గత నెలలో అపాచీ ఆర్టీఆర్ 200 యొక్క కొత్త మోడల్‌ను విడుదల చేసింది మరియు ఇప్పుడు అపాచీ ఆర్ఆర్ 310 యొక్క కొత్త మోడల్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తుంది. టీవీఎస్ అపాచీ ఆర్ఆర్ 310 యొక్క అప్డేట్స్ గురించి సరైన సమాచారం అందుబాటులో లేనప్పటికీ, కొన్ని చిన్న-డిజైన్ మరియు ఫీచర్ నవీకరణలు మినహా బైక్ ఎటువంటి ముఖ్యమైన మార్పులను ఉండే అవకాశం లేదని తెలుస్తుంది.

ఈ టీవీఎస్ అపాచీ ఆర్ఆర్ 310 బైక్ అదే 312.3 సిసి సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ను ఉపయోగిస్తుంది, ఇది 33.5 బిహెచ్పి పవర్ మరియు 27 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అంతే కాకుండా ఈ బైక్‌లో స్లిప్పర్-క్లచ్‌తో 6-స్పీడ్ గేర్‌బాక్స్ అందుబాటులో ఉంటుంది.