2021 మార్చిలో జరిగిన అమ్మకాలు 84 శాతం పెరుగుదలను చూపించాయి. గత ఏడాది ఇదే సమయంలో కేవలం 35,814 యూనిట్లను ద్విచక్ర వాహనాలకు మాత్రమే విక్రయించినట్లు కంపెనీ నివేదికలు తెలిపాయి.

2020 మార్చిలో కరోనా మహమ్మారి అధికంగా వ్యాపించిన కారణంగా కరోనా లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ కరోనా లాక్ డౌన్ మొత్తం ఆటో పరిశ్రమను కుదిపివేసింది. ఈ సమయంలో అమ్మకాలు బాగా తగ్గిపోయాయి. అయితే తర్వాత లాక్ డౌన్ విరమించిన సమయంలో మెల్ల మెల్లగా అమ్మకాలు పెరుగుదల దిశవైపు సాగుతున్నాయి.
MOST READ:గిఫ్ట్‌గా పొందిన కారుని గురువుకి గిఫ్ట్‌గా ఇచ్చిన ఇండియన్ క్రికెటర్, ఎవరో తెలుసా?

రాయల్ ఎన్ఫీల్డ్ గత నెలలో 5,885 యూనిట్ల బైక్‌లను ఎగుమతి చేసింది. అయితే గత ఏడాది ఇదే నెలలో దేశీయ అమ్మకాలు 32,630 యూనిట్లు కాగా, ఎగుమతుల సంఖ్య 3,184 యూనిట్లుగా నమోదయ్యింది. మరోవైపు కంపెనీ యొక్క వార్షిక అమ్మకాల గణాంకాలను పరిశీలిస్తే, రాయల్ ఎన్ఫీల్డ్ 2019-20 ఆర్థిక సంవత్సరంలో 6,95,959 బైక్‌లను విక్రయించగా, 2020-21 ఆర్థిక సంవత్సరంలో 6,12,350 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో వార్షిక రేటుతో అమ్మకాలు 12 శాతం తగ్గాయి.

రాయల్ ఎన్ఫీల్డ్ గత ఏడాది నవంబర్‌లో మీటియార్ 350 ను లాంచ్ చేయడంతో 350 సిసి విభాగంలో మరో కొత్త బైక్‌ను చేర్చింది. దేశంలో 350 సిసి బైక్‌ల తయారీలో రాయల్ ఎన్ఫీల్డ్ అతిపెద్దది. సంస్థ తన బైక్ శ్రేణిని నిరంతరం అప్డేట్ చేస్తోంది. ఇటీవలే కంపెనీ హిమాలయన్, కాంటినెంటల్ జిటి ఇంటర్‌సెప్టర్‌ను కూడా అప్డేట్ చేసింది.
MOST READ:మళ్ళీ పట్టాలెక్కిన ‘గాతిమాన్ ఎక్స్‌ప్రెస్’.. టైమింగ్ & ఫుల్ డీటైల్స్

రాయల్ ఎన్ఫీల్డ్ త్వరలో కొన్ని కొత్త బైక్‌లతో పాటు ఇప్పటికే అమ్ముడైన బైకులను అప్డేట్ చేయడానికి తగిన సన్నాహాలను సిద్ధం చేస్తుంది. కంపెనీ గత కొన్ని రోజులుగా క్లాసిక్ 350 సిసి యొక్క కొత్త మోడల్‌ను టెస్ట్ చేస్తోంది. దీనితో పాటు కొత్త బైక్ హంటర్ 350 టెస్టింగ్ కూడా జరుగుతోంది.

ఇటీవల ఈ బైక్ చెన్నై వీధుల్లో టెస్టింగ్ సమయంలో కనిపించింది. ఈ బైక్ సంస్థ యొక్క అత్యంత భిన్నమైన బైక్ అయ్యే అవకాశం ఉంది, ఎందుకంటే ఇది చాలా ఆకర్షణీయమైన డిజైన్‌తో రాబోతున్న రోడ్‌స్టర్ బైక్. రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ నేరుగా హోండా సిబి 350 ఆర్ఎస్ మరియు హైనెస్ సిబి 350 లతో పోటీ పడనుంది.
MOST READ:టెస్టింగ్ దశలో ఉన్న సింపుల్ ఎనర్జీ ఎలక్ట్రిక్ స్కూటర్; ఒక చార్జితో 240 కి.మీ మైలేజ్

ఈ కొత్త బైక్ డిజైన్ ప్రకారం, సంస్థ యొక్క ఇతర 350 సిసి బైక్‌ల కంటే చాలా భిన్నంగా ఉంటుంది. ఈ బైక్‌కు కొత్త 350 సిసి ఇంజన్ ఇవ్వబడుతుంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం ప్రకారం, ఈ బైక్‌లో అల్లాయ్ వీల్స్, రెండు చక్రాలపై డిస్క్ బ్రేక్‌లు, టిప్పర్ నావిగేషన్‌తో సింగిల్ పాడ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు హాలోజన్ టర్న్ ఇండికేటర్ ఉన్నాయి. ఈ బైక్‌ను కంపెనీ త్వరలో మరిన్ని అప్డేట్స్తో తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది.