లక్షాధికారి కావడానికి ఫార్ములా..!

నిజానికి యువతే దేశ భవిష్యత్తు. ఆర్థికంగా బలపడేందుకు కేవలం టీకోసం ఖర్చు చేసే డబ్బు ఉంటే చాలని మీకు తెలుసా. టీ తాగటం మానేస్తే కోటీశ్వరులు ఎలా అవుతారు అను మీకు అనుమానం రావటం సహజమే. మీరు రోజూ టీ తాగటం కోసం వెచ్చించే డబ్బు మిమ్మల్ని సంపన్నులుగా ఎలా మారుస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..

బయట రోజూ రెండు టీలు తాగితే కనీసం రూ. 20 ఖర్చవుతుంది. అంటే నెలకు 600 రూపాయలు ఖర్చు పెట్టాలి. ఈ డబ్బును ఆదా చేయడం ద్వారా.. మీరు మీ పోర్ట్‌ఫోలియోలో రూ. 10 కోట్ల వరకు డిపాజిట్ చేయవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ ఇందుకు సరైన పెట్టుబడి ఎంపిక. ఇందులో ప్రతి నెలా పెట్టుబడి సౌకర్యం లభిస్తుంది. మీరు టీ తాగడం మానేసి ఆ మెుత్తాన్ని సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) చేయవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ చాలా కాలం పాటు బలమైన రాబడిని అందించాయి. ప్రజలను లక్షాధికారులను చేశాయి. కొన్ని ఫండ్స్ 20 శాతం వరకు రిటర్న్స్ ఇచ్చాయి.

మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి ఇలా చేయాలి..

మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి ఇలా చేయాలి..

20 ఏళ్ల యువకుడు టీ అలవాటును విడిచిపెట్టి.. ప్రతిరోజూ రూ. 20 ఆదా చేస్తే ఈ మొత్తం ఒక నెలలో రూ. 600 చేరుకుంటుంది. ఈ మొత్తాన్ని ప్రతి నెలా మ్యూచువల్ ఫండ్స్‌లో SIP చేయాలి. 40 ఏళ్లు (480 నెలలు) నిరంతరంగా రూ. 20 డిపాజిట్ చేయడం ద్వారా రూ.10 కోట్లకు పైగా సమీకరించవచ్చు. ఈ లెక్కన ఈ పెట్టుబడిపై సగటు వార్షిక రాబడి 15% ఉన్నట్లయితే.. 40 ఏళ్ల తర్వాత మొత్తం ఫండ్ విలువ రూ.1.88 కోట్లు చేరుకుంటుంది. ఈ 40 ఏళ్లలో పెట్టుబడిదారు కేవలం రూ. 2,88,000 మాత్రమే డిపాజిట్ చేస్తారు. మరోవైపు, నెలకు రూ.600 సిప్‌పై 20 శాతం రాబడి ఉంటే.. 40 ఏళ్ల తర్వాత మొత్తం రూ.10.21 కోట్లు రాబడి వస్తుంది.

రోజూ రూ.30 చొప్పున ఇన్వెస్ట్ చేస్తే..

రోజూ రూ.30 చొప్పున ఇన్వెస్ట్ చేస్తే..

ఇదే సమయంలో.. 20 ఏళ్ల యువకుడు ప్రతిరోజూ రూ. 30 ఆదా చేస్తే, అది నెలలో రూ. 900 అవుతుంది. ఎవరైనా ఈ మొత్తాన్ని SIP ద్వారా ఏదైనా డైవర్సిఫైడ్ మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తే.. 40 ఏళ్ల తర్వాత 12 శాతం వార్షిక రాబడి చొప్పున రూ. 1.07 కోట్లు రిటర్న్స్ పొందవచ్చు. ఈ సమయంలో రూ.4,32,000 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో చిన్న టీ అలవాటు మానేసి కోటీశ్వరులు అయ్యే మార్గాన్ని ఎవరైనా ఎంచుకోవచ్చు.

మ్యూచువల్ ఫండ్స్‌లో చక్రవడ్డీని(కాంపపౌండింగ్) పొందడం ద్వారా.. చిన్న పెట్టుబడి కూడా పెద్ద దీర్ఘకాలిక ఫండ్‌గా మారడం గమనించదగ్గ విషయం. అయితే.. మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం వల్ల నష్టాలు కూడా ఉంటాయి. కాబట్టి.. పెట్టుబడి పెట్టే ముందు ఖచ్చితంగా ఆర్థిక సలహాదారు సహాయం తీసుకోవటం ఉత్తమం. అప్పుడే సరైన ఫండ్ ను ఎంచుకోవచ్చు.Source link

Leave a Reply

Your email address will not be published.