పోస్టాఫీసు RD ఖాతా అంటే ఏమిటి?

పోస్టాఫీసు RD డిపాజిట్ ఖాతా అనేది చిన్న మొత్తాలను డిపాజిట్ చేసుకునేవారికోసం ఇద్దేశించిన మంచి స్కీమ్. ఇందులో.. పెట్టుబడిదారులు ప్రతి నెలా నిర్ణీత మొత్తాన్ని అంటే వాయిదాల్లో డిపాజిట్లు చేస్తారు. మెరుగైన వడ్డీ రేటుతో చిన్న మొత్తాన్ని డిపాజిట్ చేయడానికి ఇది ప్రభుత్వ హామీతో కూడుకున్న పథకం. ఇందులో కనీసం రూ. 100 నుంచి పెట్టుబడులను ప్రారంభించవచ్చు. పెట్టుబడిపై గరిష్ఠ పరిమితి ఉండదు. అందువల్ల పెట్టుబడిదారులు RD ఖాతాలో తన వెసులుబాటుకు అనుగుణంగా కావలసినంత డబ్బును జమ చేసుకోవచ్చు.

ఖాతా ఎలా తెరవాలి..

ఖాతా ఎలా తెరవాలి..

పోస్టాఫీసు RD స్కీమ్ లో ఖాతా ఐదేళ్లపాటు తెరవబడుతుంది. అయితే మీరు ఏదైనా బ్యాంకులో కూడా RD ఖాతాను తెరవాలనుకుంటే.. దీని కోసం మీకు ఆరు నెలలు, 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలను ఎంచుకోవచ్చు. రికరింగ్ డిపాజిట్ ఖాతాల్లో జమ చేసిన డబ్బుపై ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీ లెక్కించబడుతుంది. ఇలా చక్రవడ్డీ రావటం వల్ల పెట్టుబడికి మంచి రాబడి లభిస్తుంది.

 పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్ పథకంపై ఎంత వడ్డీ లభిస్తుంది?

పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్ పథకంపై ఎంత వడ్డీ లభిస్తుంది?

పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ పథకంలో చెల్లించే వడ్డీని భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్ణయిస్తుంది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రతి త్రైమాసికంలో అన్ని చిన్న పొదుపు పథకాలపై చెల్లించే వడ్డీ రేట్ల వివరాలను ప్రకటిస్తుంది. ప్రస్తుతం.. పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్ పథకంపై 5.8 శాతం వడ్డీ ఇవ్వబడుతోంది. ఈ రేటు 1 ఏప్రిల్ 2020 నుంచి అమలులో ఉంది.

ప్రతి నెల రూ.10 వేలు పెట్టుబడి మంచి రాబడి:

ప్రతి నెల రూ.10 వేలు పెట్టుబడి మంచి రాబడి:

పోస్టాఫీసులోని రికరింగ్ డిపాజిట్ పథకంలో.. 10 సంవత్సరాల పాటు ప్రతి నెల రూ.10 వేలు డిపాజిట్ చేస్తే మంచి రాబడి వస్తుంది. 5.8% వడ్డీ రేటుతో మెచ్యూరిటీ సమయంలో నెలనెలా పొదుపు చేసుకునే వారికి ఏకంగా రూ.16 లక్షలకు పైగా రాబడి లభిస్తుంది. అంటే రూ. 16,28,963 వస్తాయి. ఒక వేళ ఏ కారణం వల్లనైనా డబ్బు జమ చేయలేక పోతే పెనాల్టీ కూడా అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అలాగే వరుసగా 4 వాయిదాలు చెల్లించనందుకు మీ ఖాతా మూసివేయబడుతుందని గుర్తుంచుకోండి.

రికరింగ్ డిపాజిట్‌పై కూడా టాక్స్ చెల్లించాలా..

రికరింగ్ డిపాజిట్‌పై కూడా టాక్స్ చెల్లించాలా..

పోస్టాఫీసు RD లేదా రికరింగ్ డిపాజిట్‌పై కూడా ఆదాయపు పన్ను విధించబడుతుంది. ఇది TDS రూపంలో ముందుగానే తీసివేయబడుతుంది. కానీ.. డిపాజిట్ మొత్తం రూ.40,000 దాటితేనే అది తీసివేయబడుతుంది. మీ డిపాజిట్ ఇలా ఉంటే.. సంవత్సరానికి 10% చొప్పున పన్ను విధించబడుతుంది. RDపై ఆర్జించే వడ్డీ కూడా పన్ను పరిధిలోకి వస్తుంది. కానీ.. మొత్తం మెచ్యూరిటీ మొత్తానికి పన్ను విధించబడదు. పన్ను విధించదగిన ఆదాయం లేని పెట్టుబడిదారులు ఫారమ్-15G ఫైల్ చేసి TDS మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చు.Source link

Leave a Reply

Your email address will not be published.