News
oi-Kannaiah
Tatas, Ambanis, Adanis and Birlas: రిజర్వు బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచటం వల్ల కేవలం సామాన్యులనే కాదు దిగ్గజ వ్యాపారవేత్తలను సైతం అది కలవరపరుస్తోంది. పెరిగిన వడ్డీ రేట్లు వారినీ ఆందోళనకు గురిచేస్తున్నాయి. వారిపైనా అప్పుల భారాన్ని అమాంతం పెంచుతున్నాయి. 4 సంవత్సరాల్లో మొదటిసారిగా ఈ నెలలో RBI వడ్డీ రేట్లను పెంచిన తర్వాత దేశంలో అధిక-అప్పులు కలిగిఉన్న కంపెనీల పరిస్థితి త్వరలోనే తలకిందులు కానుంది. వారి వ్యాపార అంచనాలు, ప్రణాళికలు, లాభదాయకత తీవ్రంగా ప్రభావితం కానున్నాయి. వారి అదృష్టాలు త్వరలో మారవచ్చని కొన్ని నివేదికలు చెబుతున్నాయి.
రుణ భారం బదిలీ:
రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం కారణంగా ఏర్పడిన “ప్రపంచ ద్రవ్యోల్బణం” కారణంగా అనేక దేశాల సెంట్రల్ బ్యాంకులు ద్రవ్యోల్బణ నియంత్రణకు ప్రాధాన్యతనిచ్చాయి. దానికి అనుగుణంగా వడ్డీ రేట్లలో కీలక మార్పులు చేస్తున్నాయి. వృద్ధిని వెనుక సీటుపై ఉంచి, ధరల కట్టడిపై రిజర్వు బ్యాంక్ దృష్టి సారించినట్లు ఆర్బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు.రెపో రేటు అనేది బ్యాంకులకు ఆర్బిఐ డబ్బు వడ్డీకి ఇచ్చే రేటు. రెండు సార్లు దీనిని పెంచటం వల్ల బ్యాంకులు కూడా తమ రుణాల రేట్లను పెంచుతున్నాయి.దీంతో రుణాలు పొందటం ఖరీదుగా మారుతున్నాయి.బ్యాంకులు ఈ పెరిగిన రుణ వ్యయాన్ని ఖాతాదారులకు, కంపెనీలకు బదిలీ చేస్తున్నాయి.

రుణాల వివరాలు:
వడ్డీ రేట్ల పెంపు క్యాపిటల్ ఇంటెన్సివ్ సెక్టార్లతో పాటు మౌలిక సదుపాయాలు, టెలికాం, యుటిలిటీస్, మెటల్స్ వంటి అధిక రుణాలు కలిగి ఉన్న రంగాల్లోని కంపెనీలను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. కానీ ఐటీ కంపెనీలకు అప్పులు లేవు.మారుతి సుజుకి, TVS మోటార్ వంటి ఇతర సంస్థలు కూడా తక్కువ రుణ భారం కలిగి ఉన్నాయి.టాటా గ్రూప్ రూ.2,89,080 కోట్లు, రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.2,66,305 కోట్లు, ఆదిత్య బిర్లా గ్రూప్ రూ.2,29,857 కోట్లు, అదానీ గ్రూప్ రూ.2,18,271 కోట్లు అత్యధిక అప్పులున్న కంపెనీలుగా ఉన్నాయి. వీటికి తోడు L&T రూ. 1,62,792 కోట్లు, మహీంద్రా గ్రూప్ రూ. 74,667 కోట్లు, బజాజ్ గ్రూప్ రూ.61,253 కోట్ల మేర అప్పులు కలిగి ఉన్నాయి. ఈ కారణంగా వడ్డీ రేట్లు తక్కువగా ఉండే విదేశీ మార్కెట్ల నుంచి కంపెనీలు తమ వ్యాపార అవసరాల కోసం నిధులను సేకరించే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.
English summary
corporate companies with high debts going to be effected severly after interest rates hike in india
know how increasing interest rates going to impact indian corporate gaints fortune
Story first published: Monday, June 13, 2022, 7:22 [IST]