News
oi-Srinivas G
దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు (మంగళవారం, 14, 2022) ఫ్లాట్‌గా ఉన్నాయి. నిన్న భారీగా కుప్పకూలిన సూచీలు నేడు కాస్త లాభాల్లో ఉన్నాయి. సూచీలు నష్టాల్లో ప్రారంభమైనప్పటికీ, కొద్ది నిమిషాల్లోనే సానుకూల దిశకు వచ్చాయి. సెన్సెక్స్ నిన్న 1400 పాయింట్లకు పైగా, నిఫ్టీ 420 పాయిట్లకు పైగా క్షీణించడంతో ఇన్వెస్టర్ల సంపద రూ.7 లక్షల కోట్ల వరకు క్షీణించింది. నేడు మాత్రం సూచీలు సానుకూలంగా కదలాడుతున్నాయి.
మధ్యాహ్నం గం.11 సమయానికి సెన్సెక్స్ 100 పాయింట్లకు పైగా లాభాల్లో ఉంది. సెన్సెక్స్ ఉదయం 52,496 పాయింట్ల వద్ద ప్రారంభమై, 52,977 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 52,459 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 15,674 పాయింట్ల వద్ద ప్రారంభమై, 15,818 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 15,659 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ గం.11 సమయానికి 111 పాయింట్లు ఎగిసి 52,958 పాయింట్ల వద్ద, నిఫ్టీ 37 పాయింట్లు లాభపడి 15,812 పాయింట్ల వద్ద కదలాడింది.

ఆయిల్ అండ్ గ్యాస్‌తో పాటు ఇతర రంగాల సూచీలు లాభాల్లో ఉన్నాయి. రియాల్టీ, పవర్ సూచీలు కూడా ఒక శాతం చొప్పున లాభపడ్డాయి. నేటి టాప్ గెయినర్స్ జాబితాలో అదానీ పోర్ట్స్, అపోలో హాస్పిటల్స్, అల్ట్రా టెక్ సిమెంట్, ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్ కార్పోరేషన్ ఉండగా, టాప్ లూజర్స్ జాబితాలో బీపీసీఎల్, రిలయన్స్, ఓఎన్జీసీ, HDFC లైఫ్, యూపీఎల్ ఉన్నాయి. ప్రభుత్వ రంగ బీమా సంస్త ఎల్ఐసీ నేడు స్వల్ప లాభాల్లోకి వచ్చింది. లిస్టింగ్ నుండి నిన్నటి వరకు 30 శాతం మేర కుప్పకూలిన స్టాక్స్, ఈ రోజు దాదాపు 1 శాతం ఎగిశాయి. మధ్యాహ్నం గం.11.10 సమయానికి ఎల్ఐసీ స్టాక్ 1 శాతం లేదా రూ.6.60 లాభపడి రూ.675 వద్ద ట్రేడ్ అయింది.
English summary
Indices trade flat: power stocks gain, banks down
Among sectors, except bank and oil & gas, other sectoral indices are trading in the green.
Story first published: Tuesday, June 14, 2022, 11:20 [IST]