News
oi-Srinivas G
ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) హోమ్ లోన్ వడ్డీ రేట్లను స్వల్పంగా పెంచింది. కేంద్ర బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) కీలక రెపో రేటును గత నెలలో 40 బేసిస్ పాయింట్లు, ఇటీవల 50 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో వడ్డీ రేటు ఐదు వారాల వ్యవధిలో 90 బేసిస్ పాయింట్లు పెరిగింది. ఇందుకు అనుగుణంగా బ్యాంకులు కూడా వడ్డీ రేట్లను పెంచుతున్నాయి.
ఎస్బీఐ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్ బేస్డ్ లెండింగ్ రేటు(MCLR)ను 20 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. బుధవారం నుండి అమల్లోకి వచ్చాయి. ఏడాది కాలపరిమితి ఎంసీఎల్ఆర్ 7.20 శాతం నుండి 7.40 శాతానికి పెంచింది. దీంతో వెహికిల్, హోమ్ లోన్, పర్సనల్ లోన్ రుణాలపై వడ్డీ రేటు భారం కానున్నది. పెంచిన వడ్డీ రేట్లు నేటి నుండి (జూన్ 15, 2022) నుండి అమల్లోకి వచ్చాయి.

ఏడాది నుండి మూడేళ్ల కాలపరిమితి ఎంసీఎల్ఆర్ 7.05 శాతం నుండి 7.70 శాతానికి పెంచారు. రెపో రేటు లింక్డ్ రుణాలపై వడ్డీ రేటును సవరించింది. 6.65 శాతం నుండి 7.15 శాతానికి పెంచింది. చాలామంది కస్టమర్ల ఆటో, హోమ్, పర్సనల్ లోన్లు ఎంసీఎల్ఆర్తో లింక్ అయి ఉంటాయి. ఏప్రిల్ 1, 2016 నుండి ఎంసీఎల్ఆర్ సిస్టం అమల్లోకి వచ్చింది.
English summary
SBI hikes home loan interest rate
SBI has hiked the lending rates following the RBI’s repo rate hike last week. The central bank had hiked the repo rate by 0.50 per cent to 4.90 per cent.
Story first published: Wednesday, June 15, 2022, 13:25 [IST]