News
oi-Srinivas G
అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు ప్రభావం స్టాక్ మార్కెట్లపై తీవ్రంగా పడింది. ఉదయం భారీ లాభాల్లో ప్రారంభమై, సానుకూలంగా కనిపించిన సూచీలు, ఆ తర్వాత అంతకంతకూ దిగజారాయి. ఉదయం దాదాపు 500 పాయింట్లకు పైగా లాభపడి 53,000 క్రాస్ చేసిన స్టాక్ మార్కెట్లు, క్రమంగా పడిపోతూ, మధ్యాహ్నం గం.11.30 నష్టాల్లోకి వెళ్లాయి. ఆ తర్వాత అంతకంతకూ పడిపోయి, మధ్యాహ్నానికి దాదాపు 900 పాయింట్ల మేర క్షీణించింది. సెన్సెక్స్ 52,000 మార్కు దిగువకు పడిపోయింది.
నేడు 53,000 పాయింట్లను క్రాస్, చేసి ఆ తర్వాత 52,000 పాయింట్ల దిగువకు పడిపోవడం గమనార్హం. మధ్యాహ్నం గం.2 సమయానికి సెన్సెక్స్ 830 పాయింట్లు లేదా 1.58 శాతం క్షీణించి 51,692 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 255 పాయింట్లు లేదా 1.62 శాతం తగ్గి 15,415 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. సెన్సెక్స్ నేడు 1500 పాయింట్ల మేర పైకి, కిందకు కదలాడింది. నిఫ్టీ 52 వారాల కనిష్టాన్ని తాకింది. మెటల్, రియాల్టీ, ఐటీ స్టాక్స్ భారీగా నష్టపోయాయి.

మార్కెట్లు ప్రస్తుతం ఏడాది కనిష్టం వద్ద ఉన్నాయి. సెన్సెక్స్ నేడు భారీ గరిష్టం నుండి పడిపోయింది. ప్రధానంగా ఫెడ్ వడ్డీ రేటును 0.75 బేసిస్ పాయింట్లను పెంచడం ప్రభావం చూపిందని అంటున్నారు. మధ్యాహ్నం సమయం వరకు టాప్ గెయినర్స్ జాబితాలో బ్రిటానియా, మారుతీ సుజుకీ, నెస్ట్లే ఉండగా, టాప్ లూజర్స్ జాబితాలో టాటా స్టీల్, ఓఎన్జీసీ, టాటా మోటార్స్, టెక్ మహీంద్రా, భారతీ ఎయిర్ టెల్ ఉన్నాయి.
English summary
Sensex tanks 800 points, Market at year’s low
Equity markets erased gains as a post-Fed relief rally fizzled out. An Asian share gauge flat-lined, European contracts made modest advances, while S&P 500 and Nasdaq 100 futures reversed gains, hit by the prospect of sustained rate hikes by the US Fed to rein in runaway inflation.
Story first published: Thursday, June 16, 2022, 14:36 [IST]