News
oi-Srinivas G
పెట్రోల్, డీజిల్ ధరలు నేడు (జూన్ 15, 2022) స్థిరంగా ఉన్నాయి. గత మూడు వారాలుగా ధరలు స్థిరంగా ఉన్నాయి. మే 21వ తేదీన కేంద్ర ప్రభుత్వం లీటర్ పెట్రోల్ పైన రూ.8, లీటర్ డీజిల్ పైన రూ.6 ఎక్సైజ్ డ్యూటీని తగ్గించింది. దీంతో వాహన వినియోగదారులకు భారీ ఊరట దక్కింది. అంతకుముందు దీపావళికి ముందు కూడా కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని తగ్గించింది. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వ్యాట్‌ను తగ్గించాయి. దీంతో ఆయా రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు రూ.100 దిగువన ఉన్నాయి. మన వద్ద రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ తగ్గించకపోవడంతో రూ.110 వద్ద ఉన్నాయి.
నేడు ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72, లీటర్ డీజిల్ ధర రూ.89.62, ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.97.28, లీటర్ డీజిల్ రూ.102.63, చెన్నైలో లీటర్ పెట్రోల్ రూ.102.63, లీటర్ డీజిల్ రూ.94.24, కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ రూ.106.03, లీటర్ డీజిల్ రూ.92.75గా ఉంది. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.66, లీటర్ డీజిల్ రూ.97.82, విశాఖలో లీటర్ పెట్రోల్ రూ.111.28, లీటర్ డీజిల్ రూ.98.86గా ఉంది.

దేశీయ చమురు రంగ సంస్థలు పెట్రోల్, డీజిల్ ధరలను ప్రతిరోజు ఉదయం 6 గంటలకు సవరిస్తాయి. అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా సవరిస్తాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఇటీవల చమురు ధరలు భారీగా పెరిగాయి. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ నేడు 116 డాలర్ల వద్ద, బ్రెంట్ క్రూడాయిల్ 119 డాలర్లకు పైన ఉంది. అయినప్పటికీ మన వద్ద ధరలు గత కొద్ది రోజులుగా స్థిరంగా ఉన్నాయి.
English summary
Fuel Prices Today: petrol, diesel rates in Delhi
Petrol and diesel prices have held steady for over three weeks, according to a price notification by fuel retailers.
Story first published: Thursday, June 16, 2022, 8:56 [IST]