News
oi-Srinivas G
తన లైఫ్ టైమ్‌లోనే ఇది వరస్ట్ బేర్ మార్కెట్‌గా కనిపిస్తోందని సింగపూర్‌కు చెందిన ప్రముఖ పెట్టుబడిదారు, ఆర్థిక నిపుణులు జిమ్ రోగర్స్ అన్నారు. యూఎస్ ఫెడ్ బెంచ్ మార్క్ వడ్డీ రేటును 75 బేసిస్ పాయింట్లు పెంచిందని, దీనిని మార్కెట్‌కు శుభవార్తగానే భావించాలని, పదునైన రేటు పెంపు ఉంటే పెట్టుబడిదారులను బేర్ మార్కెట్‌గా భావించేలా చేస్తుందని వ్యాఖ్యానించారు.
కరోనా, ఆ తర్వాత రష్యా – ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా అధిక ద్రవ్యోల్బణం వంటి సమయాల్లో బంగారం, వంటి కమోడిటీలు సెక్యూర్డ్ అన్నారు. కరోనా, యుద్ధం వల్ల ఫైనాన్షియల్ మార్కెట్లు, షేర్ల వ్యాల్యూ క్షీణించిందని, అదే కమోడిటీ ధరలు పెరిగాయని గుర్తు చేశారు. రానున్న మూడు నాలుగేళ్ల వరకు అధిక ద్రవ్యోల్భణ సమస్య కొనసాగే అవకాశముందని, బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచుతూ ఉండవచ్చునని అభిప్రాయపడ్డారు.

భారత్ సహా పలు దేశాల్లో రియాల్టీలో బబుల్స్ కనిపిస్తున్నాయని, అవి ఎప్పుడైనా పేలే అవకాశాలు లేకపోలేదని, ఇదే తీరు స్టాక్ మార్కెట్లోను కనిపించవచ్చునని చెప్పారు. మార్కెట్లో కనిపించకపోయినా రంగాలు, స్టాక్స్‌లో కనిపించే అవకాశముందన్నారు. మున్ముందు కమోడిటీలపై ఆయన బుల్లిష్‌గా ఉన్నారు. ఆర్థిక సమస్యలకు చాలా దగ్గరగా ప్రపంచం వెళ్తున్నట్లుగా కనిపిస్తోందన్నారు. 2024-25 నాటికి ప్రపంచవ్యాప్తంగా వడ్డీ రేట్లు గరిష్టాలకు చేరుకోవచ్చునని అంచనా వేశారు. ద్రవ్యోల్బణంపై పోరాటంలో భాగంగా కేంద్ర బ్యాంకులు 1970లో మాదిరి వడ్డీ రేట్లను పెంచవచ్చునని చెప్పారు.
English summary
This could be the worst bear market of his lifetime
If US Fed hikes benchmark rates by 75 basis points, market may perceive it to be good news because a sharp rate hike could make investors believe the worst is over, said investment guru Jim Rogers. He, however, warned that the worst isn’t over yet!
Story first published: Sunday, June 19, 2022, 15:24 [IST]