రూ.500 తక్కువ

గోల్డ్ బాండ్ ధరను రూ.5,091గా నిర్ణయించింది. ఎవరైనా డిజిటల్ మోడ్‌లో దరఖాస్తు చేసుకుంటే ఒక గ్రాముకు రూ.50 డిస్కౌంట్ ఉంటుంది. అంటే పది గ్రాముల బంగారంపై రూ.500 డిస్కౌంట్ వర్తిస్తుంది. డిజిటల్ మోడ్‌లో దరఖాస్తు చేసుకునే ఇన్వెస్టర్లకు గోల్డ్ బాండ్ రూ.5041కే వర్తిస్తుంది. భౌతిక బంగారం డిమాండును తగ్గించడం, దేశీయ పొదుపులో కొంతభాగాన్ని బంగారం కొనుగోలుకు ఉపయోగించే ఆర్థిక పొదుపుగా మార్చాలనే లక్ష్యంతో సావరీన్ గోల్డ్ బాండ్ పథకాన్ని నవంబర్ 2015వ తేదీన కేంద్రం ప్రారంభించింది.

వడ్డీ రేటు

వడ్డీ రేటు

బ్యాంకు ద్వారా లేదా పోస్టాఫీస్ ద్వారా గోల్డ్ బాండ్ సబ్‌స్క్రిప్షన్ పొందవచ్చు. గోల్డ్ బాండ్స్ పెట్టుబడులకు 2.50 శాతం వార్షిక వడ్డీ రేటు లభిస్తుంది. పసిడి బాండ్స్‌పైన పెట్టుబడిదారులకు ఏడాదికి ఇచ్చే 2.50 శాతం వడ్డీ రేటును రెండు భాగాలుగా చెల్లిస్తారు. ఇది ఇష్యూ చేసిన తేదీ నుండి అమల్లోకి వస్తుంది. ప్రతి 6 నెలలకు ఒకసారి వడ్డీ చెల్లిస్తారు. సావరీన్ గోల్డ్ బాండ్లపై అందుకున్న వడ్డీకి పన్ను ఉంటుంది. వడ్డీ ఆదాయం వ్యక్తిగత ఆదాయంతో కలిపి వర్తించే పన్ను స్లాబ్ ప్రకారం పన్ను చెల్లించాలి. అయితే వడ్డీ ఆదాయంపై టీడీఎస్ లేదా సోర్స్ వద్ద పన్ను విధించరు. సావరీన్ గోల్డ్ కాలపరిమితి ఎనిమిదేళ్లు. మెచ్యూరిటీ వరకు ఉంచితే మూలధన లాభాలకు పన్ను వర్తించదు.

ఇలా కొనుగోలు చేయవచ్చు

ఇలా కొనుగోలు చేయవచ్చు

బాండ్ కొనుగోలు చేసిన సమయానికి ముందు ఇండియా బులియన్, జ్యువెల్లరీస్ అసోసియేషన్ లిమిటెడ్ ప్రచురించిన 999 స్వచ్ఛత బంగారం 3 రోజుల ధరల సరాసరిని ఆధారంగా తీసుకొని ధరను నిర్ణయిస్తారు. గోల్డ్ బాండ్ ధ‌ర భార‌త క‌రెన్సీలో నిర్ణయిస్తారు. 1 గ్రాము నుండి కొనుగోలు చేయ‌వ‌చ్చు. ఎనిమిదేళ్లు బాండ్ పీరియ‌డ్ ఉంటుంది. ఐదో ఏడాది త‌ర్వాత నిష్క్ర‌మ‌ణకు అవ‌కాశముంది.

మెచ్యూరిటీ ధర అప్పటి ధరపై ఆధారపడి ఉంటుంది. స్టాక్ ఎక్స్చేంజెస్.. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, స్టాక్ హోల్డింగ్ కార్పోరేషన్ లేదా నేరుగా ఏజెంట్స్ ద్వారా గోల్డ్ బాండ్స్‌ను కొనుగోలు చేయవచ్చు. పోస్టాఫీస్, బ్యాంకుల్లోను దరఖాస్తు చేసుకోవచ్చు. వ్యక్తులు కనీసం ఒక గ్రాము నుండి 4 కిలోల వరకు ఎంతైనా కొనుగోలు చేయవచ్చు. ట్రస్టులు వంటివి అయితే 20 కిలోలు కొనుగోలు చేయవచ్చు. ఈ బాండ్స్ ద్వారా రుణ సదుపాయం పొందవచ్చు. బాండ్స్ కాలపరిమితి ముగిసిన తర్వాత ఎలాంటి మూలధన పన్ను చెల్లించకుండా డబ్బును పొందవచ్చు.Source link

Leave a Reply

Your email address will not be published.