News
oi-Mamidi Ayyappa
Meesho: ఈ-కామర్స్ యునికార్న్ మీషో వైద్య, మానసిక ఆరోగ్య కారణాల వల్ల సెలవు పెట్టే ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. దీనికింద వారికి అపరిమిత పెయిడ్ లీవ్స్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఉద్యోగులు 365 రోజుల వరకు పెయిడ్ లీవ్స్ పొందేందుకు కొత్త విధానం కింద ఇకపై అనుమతించబడనుంది. ఉద్యోగి లేదా సన్నిహిత కుటుంబ సభ్యుడు తీవ్రమైన అనారోగ్యం కారణంగా తరచుగా లేదా నిరంతరం ఆసుపత్రిలో చేర్పించాల్సి వస్తే కూడా ఇది వర్తిస్తుంది.
ఉద్యోగుల అనారోగ్యంతో ఉన్న మొత్తం కాలానికి పూర్తి జీతం, వారి కుటుంబ సభ్యుల అనారోగ్యం విషయంలో మూడు నెలల వరకు ఆదాయంలో 25 శాతం పొందేందుకు అర్హులు. సెలవు కాలానికి గాను కంపెనీ నుంచి ఆర్థిక పరిహారంతో పాటు, ఉద్యోగులు ఇన్సూరెన్స్, ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లు వంటి అదనపు ప్రయోజనాలను పొందడం కొనసాగిస్తారని సంస్థ వెల్లడించింది.

ఈ విధానం సాధారణ, వైద్యేతర సెలవులకు వర్తించనప్పటికీ.. వ్యక్తిగత లక్ష్యాలను సాధించడానికి సమయాన్ని వెచ్చించాలనుకునే ఉద్యోగులకు కూడా వర్తిస్తుంది. వ్యక్తిగత లక్ష్యాలను సాధించుకోవడానికి ఉద్యోగులకు సుదీర్ఘ సెలవులు(లాంగ్ లీవ్) అవసరమయ్యే సందర్భాలు లేదా వారు అనారోగ్యంతో ఉన్నట్లయితే లేదా కుటుంబ సభ్యుడు తీవ్ర అనారోగ్యంతో ఉన్నట్లయితే పొడిగించిన సమయం అవసరమయ్యే సందర్భాలను మేము చూస్తున్నామని మీషో సంస్థకు చెందిన ఆశిష్ కుమార్ సింగ్ తెలిపారు.
అవసరమైన ఉద్యోగులకు ఈ విధానం ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని తాము భావిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
ఇటీవల తొలగింపులను మీషో తొలగించినప్పటికీ.. సుమారు 2,000 మంది ఉద్యోగులను కలిగి ఉంది. గత సంవత్సరం సాఫ్ట్‌బ్యాంక్ నేతృత్వంలో ఇది యునికార్న్‌గా మారడానికి 300 మిలియన్ డాలర్ల క్యాపిటల్ ను సేకరించింది.
English summary
e commerce company meesho announced 365 days paid leave policy to its ill healthy employees
startup unicorn meesho announced unlimited paid leaves to employees who are eligible under new policy
Story first published: Tuesday, June 21, 2022, 15:17 [IST]