ప్రత్యేక ఆడిట్..

వివిధ ఏర్పాట్ల కింద కన్సార్టియం నుంచి 2010- 2018 మధ్య కాలంలో కంపెనీ రూ. 42,871 కోట్ల లోన్లను పొందింది. అయితే మే, 2019 నుంచి తిరిగి చెల్లించే కమిట్‌మెంట్‌లను డిఫాల్ట్ చేయడం ప్రారంభించినట్లు బ్యాంక్ ఆరోపించిందని సీబీఐ అధికారులు చెప్పారు. దీని కారణంగా బ్యాంకులు డీహెచ్ఎఫ్ఎల్ కు చెందిన లోన్లను ఎన్పీఏలుగా ప్రకటించాయి.

నిధుల మళ్లింపు, రౌండ్ ట్రిప్పింగ్, నిధులను స్వాహా చేయడం ద్వారా మోసం గురించి దేశంలోని మీడియాలో నివేదికలు వెలువడిన తర్వాత జనవరి 2019లో DHFL దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. ఆ తరువాత ఫిబ్రవరి 1, 2019న కంపెనీకి రుణాలిచ్చిన బ్యాంకులు సమావేశాన్ని నిర్వహించారు.

పారిపోకుండా చర్యలు..

పారిపోకుండా చర్యలు..

ఏప్రిల్ 1, 2015 నుంచి డిసెంబర్ 31, 2018 వరకు DHFL అకౌంట్లను, ఆర్థిక లావాదేవీలను స్పెషల్ ఆడిట్ నిర్వహించడానికి రుణ సభ్యులు KPMGని నియమించారు. ఈ క్రమంలో.. కపిల్, ధీరజ్ వాధ్వాన్ దేశం విడిచి వెళ్లకుండా నిరోధించేందుకు అక్టోబర్ 18, 2019న వీరిపై లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేసేందుకు బ్యాంకులు ముందుకొచ్చాయి. KPMG తన ఆడిట్‌లో లోన్స్ అండ్ అడ్వాన్స్‌ల రూపంలో నిధులను సంబంధం ఉన్న ఇతర సంస్థలకు, కొందరు వ్యక్తులకు అక్రమంగా మళ్లించిందని తెలిపింది.

అక్రమ ఆస్తులు కూడబెట్టారు..

అక్రమ ఆస్తులు కూడబెట్టారు..

DHFL ప్రమోటర్లతో ఉమ్మడిగా ఉన్న 66 సంస్థలకు రూ. 29,100.33 కోట్లు పంపిణీ చేయగా.. వాటి నుంచి రూ. 29,849 కోట్లు బకాయిలు ఉన్నాయని నివేదిక వెల్లడించింది. “అటువంటి సంస్థలు, వ్యక్తుల చాలా లావాదేవీలు భూమి, ఆస్తుల్లో పెట్టుబడుల రూపంలో ఉన్నాయి” అని బ్యాంక్ ఆరోపించింది. కపిల్, ధీరజ్ వాధ్వన్‌లకు ఆస్తులు సృష్టించేందుకు.. భారీగా ఆర్థిక అవకతవకలు, నిధుల మళ్లింపు, బూటకపు లావాదేవీల కల్పన, నిధుల రౌండ్ ట్రిప్పింగ్ జరిగినట్లు ఆడిట్ వెలుగులోకి తెచ్చింది.Source link

Leave a Reply

Your email address will not be published.