News
oi-Mamidi Ayyappa
Elon Musk: మైక్రో-బ్లాగింగ్ సైట్‌ను ఎలాన్ మస్క్ కొనుగోలు చేయడాన్ని ట్విట్టర్ బోర్డు ఏకగ్రీవంగా ఆమోదించింది. మస్క్ 44 బిలియన్ డాలర్ల డీల్ కోసం కంపెనీని టేకోవర్ చేయడానికి మస్క్ బిడ్ చేసిన విషయం తెలిసిందే. ఏది ఏమైనప్పటికీ.. మస్క్ ఈ డీల్ గురించి రెండు ఆలోచనలతో ఉన్నాడు. ఒకానొక సమయంలో.. దానిని రద్దు చేస్తానని బెదిరించాడు. బోర్డు ఆమోదంతో ఒప్పందం ముగుస్తుంది. అయితే.. ఇప్పుడు ఈ ఒప్పందానికి బోర్డు ఆమోదం తెలపడంతో మస్క్ డీల్ విషయంలో ముందడుగు వేశారు. డీల్‌ను ముగించడానికి మస్క్‌కి తగిన నిధులు కూడా అవసరమని తెలుస్తోంది.
ట్విట్టర్ బోర్డ్ ఆమోదం..
ట్విట్టర్ బోర్డ్.. ఈ ప్రాక్సీ స్టేట్మెంట్లోని విభాగంలో వివరించిన వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత విలీనాన్ని ఆమోదించినట్లు ట్విట్టర్ మంగళవారం సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ ఫైలింగ్‌లో తెలిపింది. ఖతార్ ఎకనామిక్ ఫోరమ్‌లో జరిగిన ఒక ఇంటర్వ్యూలో మస్క్ మాట్లాడుతూ.. డీల్‌కు అడ్డుగా వస్తున్న పరిష్కారం కాని విషయాల్లో వాటాదారుల ఆమోదం ఒకటని అన్నారు. నకిలీ ఖాతాల సంఖ్య గురించి “చాలా ముఖ్యమైన ప్రశ్నలు” ఉన్నాయని కూడా అన్నారు. నకిలీ ఖాతాల సంఖ్య 5 శాతం కంటే తక్కువగా ఉందని ట్విట్టర్ పేర్కొంది.

పరాగ్ కు భారీ కాంపెన్సేషన్..
ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్ భవితవ్యాన్ని పూర్తిగా కంపెనీని స్వాధీనం చేసుకున్న తర్వాత ఎలాన్ మస్క్ నిర్ణయిస్తారని తెలుస్తోంది. నివేదికల ప్రకారం.. సోషల్ మీడియా సంస్థ యాజమాన్యం మారిన 12 నెలల్లోపు అగర్వాల్‌ను తొలగించినట్లయితే 42 మిలియన్ డాలర్లు, అంటే భారత కరెన్సీ ప్రకారం దాదాపు రూ. 310 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది.
English summary
twitter board gave green signal to elon musk buyover deal
twitter board gave green signal to elon musk buyover deal
Story first published: Thursday, June 23, 2022, 17:33 [IST]