News
oi-Srinivas G
రష్యా నుండి భారత్కు చమురు దిగుమతులు ఏప్రిల్ నుండి యాభై శాతం పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్ నుండి భారత్ దిగుమతుల్లో రష్యా వాటా 10 శాతానికి పెరిగింది. ఈ మేరకు గురువారం ఓ సీనియర్ ప్రభుత్వ అధికారి వెల్లడించారు. రష్యా – ఉక్రెయిన్ యుద్ధానికి ముందు మాస్కో నుండి భారత్కు చమురు దిగుమతుల వాటా కేవలం 0.2 శాతం మాత్రమే. ఇప్పుడు ఈ వాటా 10 శాతానికి పెరిగింది. అంటే ఏప్రిల్ నుండి ఇప్పటి వరకు అంటే రెండు నెలల కాలంలోనే యాభై శాతం జంప్ చేసింది.
దీంతో భారత్కు చమురు సరఫరా చేసే టాప్ టెన్ దేశాల్లో రష్యా కూడా నిలిచింది. రష్యా చమురు దిగుమతుల్లో నలభై శాతం వరకు ప్రయివేటు సంస్థలైనా రిలయన్స్ ఇండస్ట్రీస్, రోస్నెట్ బ్యాక్డ్ నయారా ఎనర్జీ వాటా ఉంది. రష్యా – ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో మాస్కో నుండి భారత్ గత నెలలో భారీ డిస్కౌంట్తో చమురు కొనుగోలు చేసింది. ఎక్కువ చమురును కొనుగోలు చేయడంతో రెండో స్థానంలో ఉన్న సౌదీ అరేబియాను అధిగమించింది రష్యా. ఇప్పటి వరకు భారత్కు అతిపెద్ద చమురు సరఫరాదారు ఇరాక్. ఆ తర్వాత సౌదీ ఉండేది. కానీ ఈసారి రష్యా రెండో స్థానానికి వచ్చింది.

మే నెలలో భారత రిఫైనరీస్ రష్యా నుండి 25 మిలియన్ బ్యారెల్స్ చమురును తెప్పించాయి. ఏప్రిల్ నెలలో మొదటిసారి రష్యా నుండి భారత్కు చమురు దిగుమతులు పది శాతానికి చేరుకున్నాయి. 2021లో 0.2 శాతం నుండి 2022 మొదటి త్రైమాసికంలో 10 శాతానికి పెరిగాయి. ప్రపంచంలో చమురును అత్యంత వినియోగించే మూడో దేశం భారత్.
English summary
India’s Russian Oil Imports Jump Over 50 Times Since April
Crude oil imports from Russia have jumped over 50 times since April and now make up for 10 per cent of all crude bought from overseas, a senior government official said on Thursday.
Story first published: Friday, June 24, 2022, 10:13 [IST]