News
oi-Srinivas G
క్రిప్టో మార్కెట్ గత కొద్ది రోజులుగా దాదాపు స్థిరంగా కొనసాగుతోంది. ప్రపంచ అతిపెద్ద క్రిప్టో బిట్ కాయిన్ గత కొద్ది రోజులుగా 19,000 డాలర్ల నుండి 21,000 డాలర్ల మధ్య కదలాడుతోంది. రెండో అతిపెద్ద క్రిప్టో ఎథేరియం 1200 డాలర్లకు దిగువన ఉంది. ఎథేరియం ఆల్ టైమ్ గరిష్టం దాదాపు 5000 డాలర్లకు సమీపంలో ఉంది. కానీ ఇప్పుడు దాదాపు నాలుగు రెట్లు పతనమైంది. బిట్ కాయిన్ కూడా మూడు రెట్లకు పైగా క్షీణించింది.
ఈ వార్త రాసే సమయానికి బిట్ కాయిన్ 2.61 శాతం లాభపడి 20,865 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. గత ఇరవై నాలుగు గంటల్లో 20,167 డాలర్ల వద్ద కనిష్టాన్ని, 21,419 డాలర్ల వద్ద గరిష్టాన్ని తాకింది. బిట్ కాయిన్ మార్కెట్ క్యాప్ నేడు 397 డాలర్లు క్షీణించింది. 52 వారాల కనిష్టం 17,601 డాలర్లు, గరిష్టం 68,990 డాలర్లు.

నేడు అత్యధికంగా లాభపడిన వాటిలో యెర్న్ ఫైనాన్స్ ముందు ఉన్నది. ఇది ఏకంగా 33 శాతానికి పైగా లాభపడింది. ఇక స్టోర్జ్ 32.81 శాతం, సెల్సియస్ 29.50 శాతం, యాక్సీ ఇన్ఫినిటీ 18.71 శాతం, పాలీగోన్ 17.98 శాతం, బేసిక్ అటెన్షన్ 15 శాతం ఎగిసిపడ్డాయి. ఇక టాప్ లూజర్స్ జాబితాలో డిస్ట్రిక్స్ ఆక్స్ 10 శాతం, అల్కెమీ 2 శాతం, ప్యాక్స్ గోల్డ్ 0.41 శాతం నష్టపోయాయి.
English summary
Bitcoin rises over $21K as rate hike concerns wane
XRP surged as much as 16% in the past 24 hours as bitcoin topped the $21,000 level, and the largest cryptocurrencies showed signs of recovery after a steep fall last week.
Story first published: Friday, June 24, 2022, 21:32 [IST]