News
oi-Chekkilla Srinivas
ఉద్యోగం చేసేవారికి దాదాపుగా పీఎఫ్ అకౌంట్ ఉంటుంది. ఉద్యోగుల జీతం నుంచి నెలనెలా కొంత మొత్తం ఈ పీఎఫ్ అకౌంట్ లో జమ అవుతుంది. దీనికి ప్రభుత్వం వడ్డీ కూడా లభిస్తుంది. కానీ మధ్యలో ఉద్యోగం మారితే పీఎఫ్ అకౌంట్ మారుతుందా.. లేక ఉన్న అకౌంట్ నే కొత్త సంస్థలోకి బదిలీ చేసుకోవచ్చా అంటే… EPFO నిబంధనల ప్రకారం ఒక ఉద్యోగి మరొక సంస్థలో చేరినట్లయితే, అతను తన మునుపటి ఖాతా నుంచి తన ప్రావిడెంట్ ఫండ్‌ను బదిలీ చేయడానికి కొత్త సంస్థలో సభ్యునిగా నమోదు చేసుకోవాలి. అలాగే నిష్క్రమణ తేదీ నమోదు చేయాలి. ఇది ఆన్ లైన్ లో ఎలా చేయాలో చూద్దాం
నిష్క్రమణ తేదీని ఎలా అప్డేట్ చేయాలంటే..
1. నిష్క్రమణ తేదీని అప్డేట్ చేయడానికి ఒక ఉద్యోగి ఈపీఎఫ్ వెబ్(https://www.epfindia.gov.in/site_en/index.php) సైట్ కు వెళ్లాలి. సర్వీసెస్ లో ఎంప్లాయిస్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఆన్ లైన్ సర్వీస్ పై క్లిక్ చేయాలి.

2. ఇప్పుడు యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN), పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వాలి.
3. మేనేజ్‌కు వెళ్లి మార్క్ ఎగ్జిట్‌పై క్లిక్ చేయండి.
4. సెలెక్ట్ ఎంప్లాయ్మెంట్ డ్రాప్‌డౌన్ నుంచి PF ఖాతా నంబర్ని ఎంచుకోండి.
5. ఆ తర్వాత OTPపై క్లిక్ చేసి, మీ ఆధార్-లింక్ చేసిన మొబైల్ నంబర్‌కు వచ్చిన OTPని నమోదు చేయాలి.
6. తర్వాత చెక్‌బాక్స్‌ని ఎంచుకుని, ఒకే క్లిక్ చేయండి.
7. మీ నిష్క్రమణ తేదీ అప్డేట్అవుతుంది.
English summary
EPFO: Left your job? Know how to update the date of exit
if an employee is joining another organisation can transfer PF Account by Online
Story first published: Saturday, July 2, 2022, 15:17 [IST]