ప్లాస్టిక్ వ్యర్థాలకు ఆహారం:

గుజరాత్ లోని ఈ కేఫ్‌ను సర్వోదయ్ సఖి మండల్ అనే మహిళలు నిర్వహిస్తున్నారు. మరియు జూన్ 30న జునాగఢ్ పరిపాలన ప్రారంభించింది. జూన్ 30న జిల్లా యంత్రాంగం ఈ కేఫ్‌ను ప్రారంభించింది. ఇక్కడ ప్రజలు డబ్బుకు బదులుగా ప్లాస్టిక్ వ్యర్థాలను చెల్లించి రుచికరమైన వంటకాలను ఆస్వాదించవచ్చు. ప్రజలు తమ ఇంటి వద్ద ఉండే ప్లాస్టిక్ వ్యర్థాలను తిన్నాక చెల్లించటానికి తీసుకురావచ్చు.

ఏమి తినటానికి ఎంత ప్లాస్టిక్ ఇవ్వాలి:

కస్టమర్ తీసుకునే ఆహారం మొత్తం వారు తీసుకువచ్చే ప్లాస్టిక్ పరిమాణంపై ఆధారపడి ఉంటుంది.

ఒక కస్టమర్ 500 గ్రాముల ప్లాస్టిక్ వ్యర్థాలతో నిమ్మరసాన్ని కొనుగోలు చేయవచ్చు. అదే ఒక కిలో ప్లాస్టిక్ వ్యర్థాలతో పోహా లేదా ధోక్లా ప్లేట్‌ను కొనుగోలు చేయవచ్చు. వీటికి తోడు.. ఆహారంలో బెంగాన్ భర్తా, సెవ్ టమేటా, తేప్లా వంటి సాంప్రదాయ గుజరాతీ వంటకాలు అక్కడ అందుబాటులో ఉన్నాయి. అయితే తమలపాకు, గులాబీ, అత్తి పండు, బెల్ ఆకు వంటి కొన్ని ఆరోగ్యవంతమైన పానీయాలను అందిస్తున్నారు.

స్థానిక ఉత్పత్తులను వినియోగించి:

స్థానిక ఉత్పత్తులను వినియోగించి:

ఈ కేఫ్ లో అందించే అన్ని పదార్ధాలు సేంద్రీయమైనవి, పైగా వాటిని స్థానిక పొలాల నుంచి సేకరించినట్లు తెలుస్తోంది. అయితే పర్యావరణ అనుకూలమైన చొరవను మరింత ముందుకు తీసుకెళ్లడానికి అన్ని పానీయాలు మట్టి పాత్రల్లో అందిస్తున్నారు. స్థానిక రైతులకు మద్దతుగా, కేఫ్‌లో కస్టమర్‌లు కేఫ్ ఉపయోగించే ముడి పదార్థాలు కొనుగోలు చేసే దుకాణం ఉంది. ఈ వ్యర్థాలను కొనుగోలు చేసే ఏజెన్సీని జిల్లా యంత్రాంగమే నియమించింది.

 కొత్త ఆలోచన అమలుతో:

కొత్త ఆలోచన అమలుతో:

జులై 1 నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ నిషేధించినందున ప్రత్యామ్నాయాలను కనుగొనడంలో ఫుడ్ అండ్ బెవరేజెస్ కంపెనీలు బిజీగా ఉన్నాయి. కానీ ప్లాస్టిక్ ముప్పును ఎదుర్కోవడంలో కొత్త ఆలోచనతో గుజరాత్ లోని జునాగఢ్ అధికారులు కొత్త ఆలోచనలకు పదును పెడుతున్నారు. ప్రజలకు ఉపయోగకరమైన ఆహారాన్ని అందిస్తూ దానికి బదులుగా వారి వద్ద నుంచి ప్లాస్టిక్ రూపంలో బిల్లు వసూలు చేస్తున్నారు. ప్లాస్టిక్ పై అక్కడి అధికారులు చేస్తున్న ప్రయత్నాన్ని ఇప్పుడు అందరూ కొనియాడుతున్నారు.Source link

Leave a Reply

Your email address will not be published.