News
oi-Chekkilla Srinivas
రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) ప్యాసింజర్ కార్లు, ట్రక్కులు, బస్సుల టైర్ల ప్రమాణాలపై మార్గదర్శకాలు విడుదల చేసింది. రోలింగ్ రెసిస్టెన్స్, వెట్ గ్రిప్,రోలింగ్ సౌండ్ ఎమిషన్స్ గురించి తెలుపుతూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ప్రమాణాలు అక్టోబర్ నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. C1 (ప్యాసింజర్ కార్లు), C2 (లైట్ ట్రక్), C3 (ట్రక్, బస్) టైర్లకు టోమోటివ్ ఇండస్ట్రీ స్టాండర్డ్ 142:2019 ప్రకారం రోలింగ్ రెసిస్టెన్స్, వెట్ గ్రిప్, రోలింగ్ సౌండ్ ఎమిషన్ తప్పనిసరి చేసింది.
టైర్ల రోలింగ్ రెసిస్టెన్స్ వాహనం ఇంధన సామర్థ్యంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. రోడ్లపై ఉన్న తడి టైర్ల బ్రేకింగ్ పనితీరును ప్రభావితం చేస్తుంది. ఇది వాహనాల భద్రతపై కూడా ప్రభావం చూపుతుంది. రోలింగ్ సౌండ్ ఎమిషన్ అనేది హై స్పీడ్ పరిస్థితుల్లో రోడ్డు, టైర్ ఉపరితలం మధ్య రాపిడి వల్ల ఉత్పన్నమయ్యే శబ్దాన్ని సూచిస్తుంది. కొత్త ప్రమాణాల అమలుతో, సడన్ బ్రేకింగ్ వాహనంపై డ్రైవర్ నియంత్రణను తగ్గించదు. టైర్ వేడై పగిలిపోయే లేదా తడిగా ఉన్నప్పుడు జారిపోయే అవకాశాలను మాత్రమే తగ్గిస్తుంది.

మన దేశంలో ప్రతి సంవత్సరం దాదాపు 85,616 రోడ్డు ప్రమాదాలు జరుగుతోన్నాయి. దీనికి అతివేగం కారణమని నిపుణులు చెబుతున్నారు. ప్రమాదాలను తగ్గించేందుకు రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ నిరంతరం చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా టైర్లకు రెండు వేర్వేరు ప్రామాణిక టైర్ రోలింగ్ రెసిస్టెన్స్, వెట్ గ్రిప్, రోలింగ్ సౌండ్ ఉండాలని నిర్ణయించింది.
English summary
Road Transport Ministry notifies new standards for vehicle tyres: Details
The Ministry of Road Transport and Highways (MoRTH) has issued a notification stating the standards of tyres for passenger cars, trucks and buses viz-a-viz rolling resistance, wet grip, and rolling sound emissions.
Story first published: Sunday, July 3, 2022, 15:56 [IST]