News
oi-Chekkilla Srinivas
మీ ఇంట్లో వాడిన కరెంటుకు మీరే రీడింగ్ చూసుకుని మీరే బిల్ చెల్లించేందుకు రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు కసరత్తు చేస్తున్నాయి.ఇప్పటికే ఈ సౌకర్యాన్ని కరోనా లాక్డౌన్ సమయంలో హైదరాబాద్ లో అందుబాటులోకి తెచ్చారు. ఇప్పటివరకూ 10లక్షల మంది ఇలా సెల్‌ఫోన్ కెమెరాతో వారి ఇంట్లో కరెంటు మీటర్ రీడింగ్‌ను ఫొటో తీసి బిల్లు చెల్లించినట్లు రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ తెలిపింది. అయితే దీనికి సంబంధించి చాలా మందికి సరైన అవగాహన లేదు.
యాప్ ద్వారా
ప్లే స్టోర్ నుంచి TSSPDCL IT యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్ ఓపెన్ చేయగానే ‘కన్జ్సూమర్ సెల్ఫ్ బిల్లింగ్’ అంటూ కనిపిస్తుంది. కొత్తగా యాప్ వాడుతున్నట్లయితే యునిక్ సర్వీస్ నంబరు, ఈ-మెయిల్, మొబైల్ నంబరు వంటి వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. మీరు ఏ మీటర్ బిల్ చెల్లించాలనుకుంటే ఆ మీటర్ వద్దకు వెళ్లి రీడింగ్ ను స్కాన్ చేయాలి.
వివరాలన్నీ సక్రమంగా ఉంటే నెక్ట్స్ అని చూపిస్తుంది. దానిని నొక్కగానే ఆన్లైన్లో బిల్లు కనిపిస్తుంది.రీడింగ్ సరిగా కనిపించకుంటే రీడింగ్ అంకెలను నేరుగా నమోదు చేస్తే బిల్లు ఆన్లైన్లో కనిపిస్తుంది. బిల్లు డౌన్లోడు చేసుకుని ఆన్లైన్లో పేమెంట్ ఆప్షన్‌లోకి వెళ్లి చెల్లిస్తే సరిపోతుంది. https://play.google.com/store/apps/details?id=in.tsnpdcl.tsnpdcl లింక్ పై క్లిక్ చేయడంతో మా TSNPDCL యాప్ download చేసుకోవచ్చు.

30 రోజుల తరవాతే తీసుకోవాలి
విద్యుత్ బిల్లు కచ్చితంగా 30 రోజుల తరవాతే తీసుకోవాలి. 30 రోజుల కుంటే ముందే స్కాన్ చేసి బిల్ చెల్లిస్తే.. 30 రోజులయ్యాక డిస్కం సిబ్బంది వచ్చి మళ్లీ బిల్లు తీసి ఇస్తారు. దీంతో ఒకే నెలలో రెండు బిల్లులు వస్తాయి. ఈ సమస్య రాకుండా సెల్‌ఫోన్‌తో కరెంటు మీటరు రీడింగ్ ఫొటో తీసినప్పుడు కచ్చితంగా 30 రోజులు పూర్తయితేనే బిల్లు కనిపించేలా సాఫ్ట్‌వేర్‌ను రూపొందిస్తున్నామని డిస్కం సంస్థలు తెలిపాయి.
English summary
Electricity bill can pay through the app, which is use for taking reading, pay bill also
TSSPDCL APP, wich using for taking current meter reading, pay power bill.
Story first published: Sunday, July 3, 2022, 10:58 [IST]