News
oi-Srinivas G
బంగారం ధరలు భారీగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు గతవారం తగ్గాయి. కానీ మనవద్ద రూపాయి బలహీనపడటం, దిగుమతి సుంకాలు పెంచడంతో ధరలు పెరిగాయి. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో గోల్డ్ ఫ్యూచర్స్ ధరలు గతవారం రూ.52,000 సమీపంలో ముగిశాయి. చివరి సెషన్లోనే ఏకంగా రూ.1433 పెరిగింది. దిగుమతి సుంకాలు పెంచడంతో ఈ నాలుగు రోజుల్లో గోల్డ్ ఫ్యూచర్ ధరలు రూ.1700కు కాస్త అటుఇటుగా పెరిగాయి.
బంగారం ధరలు నేడు(సోమవారం, 24, 2022) ప్రారంభ సెషన్లో రూ.278 పెరిగి రూ.52,195 వద్ద, అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.252 తగ్గి రూ.52,414 వద్ద ట్రేడ్ అయ్యాయి. సిల్వర్ ఫ్యూచర్స్ అయితే భారీగా తగ్గాయి. రూ.58,000 దిగువకు వచ్చాయి. జూలై సిల్వర్ ఫ్యూచర్స్ నేటి ప్రారంభ సెషన్లో రూ.58 పెరిగి రూ.57,800 వద్ద, సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.55 పెరిగి రూ.58,230 వద్ద ట్రేడ్ అయ్యాయి.

అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లో నేడు గోల్డ్ ఫ్యూచర్ ధరలు పెరిగాయి. గతవారం దాదాపు 1800 డాలర్ల స్థాయికి పడిపోయాయి. నేడు మాత్రం డబుల్ డిజిట్ పెరిగింది. ఈ వార్త రాసే సమయానికి గోల్డ్ ఫ్యూచర్స్ 11 డాలర్లు లాభపడి 1812 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. సిల్వర్ ఫ్యూచర్స్ అయితే 20 డాలర్ల దిగువకు వచ్చింది. 0.128 డాలర్లు పెరిగి 19.795 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.
English summary
Gold prices: Yellow metal rises by ₹1,700 since import duty hike
Start of this month has resulted in gold prices getting costlier all thanks to the import duty hike. The price of 24 carat in 10 gram has increased by at least ₹1,700 in four days.
Story first published: Monday, July 4, 2022, 10:10 [IST]