News
oi-Srinivas G
సంస్కరణలు లేకుండా సాగితే, భారత్ చాలా నెమ్మదిగా సొంతకాళ్లపై నిలబడే దిశగా వెళ్తుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ అన్నారు. అవసరమైన సంస్కరణలను అమలు చేయకపోతే ఆర్థికవృద్ధి వేగం మందగిస్తుందన్నారు. సరైన సంస్కరణలతో, భారత్ వృద్ధి వేగం పెరుగుతుందని తాను భావిస్తున్నానని వ్యాఖ్యానించారు. దేశంలో ఎప్పుడు రాజకీయ గందరగోళం, అంతర్గత తగాదాల మధ్య నెమ్మదిగా వృద్ధి చెందవచ్చునని చెప్పారు.
సంస్కరణలు అవసరమని అభిప్రాయపడ్డారు. ఆ సంస్కరణలను ప్రయత్నిస్తున్న ప్రభుత్వం ప్రస్తుతం ఉందని, అయితే దురదృష్టవశాత్తు సంస్కరణల కోసం విస్తృత ఏకాభిప్రాయ కొరత కారణంగా వ్యతిరేకత వస్తోందని, దీంతో ఆ సంస్కరణలు నిలబడలేని పరిస్థితి ఉందని అభిప్రాయపడ్డారు. ఉదాహరణకు వ్యవసాయ చట్టాలు వెనక్కి తీసుకున్న విషయాన్ని గుర్తు చేశారు.

నవంబర్ 19న మూడు వ్యవసాయ చట్టాలపై భారీ నిరసనల అనంతరం ప్రభుత్వం వాటిని రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించటిన విషయం తెలిసిందే. అలాగే, బ్యాంకు ప్రయివేటీకరణకు సంబంధించిన ఇటీవలి నివేదికలను రాజన్ ప్రస్తావించారు. ఇది సహేతుకంగా ఉంటే, ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకు వెళ్తుందని, లేదంటే వెనక్కి నెడుతుందన్నారు.
English summary
Without reforms, India will grow too slowly for its own good
The pace of economic growth will slow down steeply if the much-needed reforms are not implemented, warned former RBI governor Raghuram Rajan.
Story first published: Monday, July 4, 2022, 13:03 [IST]