మూడు నెలల కాలంలో..

ట్రెండ్‌లైన్ అండ్ కార్పొరేట్ డేటాబేస్ ఏస్ ఈక్విటీ నుంచి వచ్చిన డేటా ప్రకారం.. ఈ విషయం తెరపైకి వచ్చింది. eMarkets.com అధ్యయనంలో రాధాకిషన్ దమానీ పోర్ట్‌ఫోలియో విలువ జూన్ 30 నాటికి రూ.1,47,534.47 కోట్లుగా ఉంది. గతంలో మార్చి 31 నాటికి దాని విలువ రూ.1,73,822 కోట్లు. అంటే జూన్ క్వార్టర్ కాలంలో ఆయన సంపద రూ.26,287.53 కోట్లు తగ్గింది. అయితే.. ఇందులో దమానీకి ఒక శాతం కంటే ఎక్కువ వాటా ఉన్న 14 స్టాక్‌లు మాత్రమే ఉన్నాయి. దమానీకి అతని స్వంత కంపెనీ అవెన్యూ సూపర్‌మార్ట్స్(డీ-మార్ట్)కు అతిపెద్ద దెబ్బ తగిలింది.

డీ-మార్ట్ షేర్లు పడిపోవటంతో..

డీ-మార్ట్ షేర్లు పడిపోవటంతో..

డీ-మార్ట్‌ను నిర్వహిస్తున్న కంపెనీలో దమానీకి 65.2 శాతం వాటా ఉంది. జూన్ త్రైమాసికంలో ఈ కంపెనీ షేర్లు 15 శాతానికి పైగా పడిపోయాయి. ఈ సమయంలో దీని ధర రూ.3,999.45 నుంచి రూ.3,396.3కి తగ్గింది. ఈ విధంగా దమానీ ఈ స్టాక్‌లో ఏకంగా రూ.25,462.52 కోట్ల నష్టాన్ని చవిచూశారు. అదేవిధంగా ఇండియా సిమెంట్స్‌లో దమానీ రూ.208 కోట్ల నష్టాపోయారు.

జూన్ త్రైమాసికంలో ఈ సిమెంట్ కంపెనీ షేర్లు 25 శాతానికి పైగా పడిపోయాయి. ఈ కంపెనీలో దమానీకి 12.7 శాతం వాటా ఉంది. ట్రెంట్‌లో పెట్టిన పెట్టుబడిపై దమానీకి రూ.109.50 కోట్ల నష్టం వాటిల్లింది. జూన్ త్రైమాసికంలో ఈ షేరు 16 శాతం క్షీణించింది. ఈ కంపెనీలో దమానీకి 1.5 శాతం వాటా ఉంది.

నష్టాలపాలు చేసిన స్టాక్‌లు..

నష్టాలపాలు చేసిన స్టాక్‌లు..

సుందరం ఫైనాన్స్, మెట్రోపాలిస్ హెల్త్‌కేర్, యునైటెడ్ బ్రూవరీస్, విఎస్‌టి ఇండస్ట్రీస్, మంగళం ఆర్గానిక్స్, ఆస్ట్రా మైక్రోవేవ్ ప్రొడక్ట్స్, బిఎఫ్ యుటిలిటీస్‌లో కూడా దమానీ పెట్టుబడులు తీవ్రంగా నష్టపోయాయి. జూన్ త్రైమాసికంలో ఈ కంపెనీల షేర్లు 38 శాతం వరకు పడిపోయాయి. ఈ కంపెనీల షేర్ల ద్వారా దమానీ మొత్తం రూ.101 కోట్ల నష్టం కలిగింది.

ఆ నాలుగు కంపెనీల్లో లాభాలు..

ఆ నాలుగు కంపెనీల్లో లాభాలు..

మరోవైపు.. ఆంధ్రా పేపర్, సుందరం ఫైనాన్స్ హోల్డింగ్స్, బ్లూ డార్ట్ ఎక్స్‌ప్రెస్, 3M ఇండియా అనే నాలుగు స్టాక్‌ల నుంచి జూన్ త్రైమాసికంలో రూ.70.6 కోట్లను దమానీ సంపాదించారు. ఈ స్టాక్స్‌లో ఆయనకు 1.3 శాతం నుంచి 2.4 శాతం వాటా ఉంది. బ్లూ డార్ట్ ఎక్స్‌ప్రెస్, 3M ఇండియా వరుసగా రూ. 31.28 కోట్లు, రూ. 36.74 కోట్ల లాభాలను అందించాయి.Source link

Leave a Reply

Your email address will not be published.