News
oi-Mamidi Ayyappa
Viral Tweet: RPG గ్రూప్ ఛైర్మన్ హర్ష్ గోయెంకా ఇటీవల తన వేలాది మంది ట్విట్టర్ ఫాలోవర్లకు కృతజ్ఞతా భావాన్ని పాటించడం, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల పట్ల మరింత దయ చూపడం ప్రాముఖ్యత గురించి ఒక చిన్న వీడియోను ట్వీట్ చేశారు. పిల్లల పట్ల తల్లిదండ్రుల నిస్వార్థత, త్యాగాన్ని హైలైట్ చేసే 2 నిమిషాల క్లిప్‌ను పంచుకున్నారు. దీనిని చూసిన నెటిజన్లు వేల సంఖ్యలో లైక్, రీట్వీట్ చేస్తుండగా.. ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్ మహీంద్రా సైతం స్పందించారు.
A great message…. pic.twitter.com/rujrZ9wxBQ
— Harsh Goenka (@hvgoenka) July 2, 2022
వీడియోలో ఏమి ఉందంటే..
గోయెంకా పంచుకున్న వీడియో పెన్సిల్, ఎరేజర్ మధ్య సంభాషణ నుంచి జీవిత పాఠాలతో కూడిన ఉపమానం. “నన్ను క్షమించండి, నా వల్ల మీరు గాయపడ్డారు. నేను తప్పు చేసినప్పుడల్లా దాన్ని చెరిపేయడానికి మీరు ఎల్లప్పుడూ ఉంటారు. కానీ.. నువ్వు చేసే పనివల్ల నా తప్పు మాయమైపోతుంది. ఇందుకోసం మీలోని కొంత భాగాన్ని కోల్పోతారు. ప్రతిసారీ చిన్నగా మారతారు”అని పెన్సిల్ బాధపడుతుంది.

A very poignant message that naturally resonates with us elderly parents. But it also occurred to me, Harsh, that often, many children in the world have to spend much of their lives erasing the mistakes & missteps of their parents! @hvgoenka https://t.co/G17NAU4jBC
— anand mahindra (@anandmahindra) July 3, 2022
ఎరేజర్ ఏమంటుందంటే..
పెన్సిల్ ఆందోళనపై ఎరేజర్ ఏమంటుందంటే.. “అది నిజమే, కానీ నాకు అభ్యంతరం లేదు. నేను ఈ పని చేయడానికి సృష్టించబడ్డాను. మీరు ఏదైనా తప్పు చేసిన ప్రతిసారీ నేను మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటాను. ఒక రోజు నేను వెళ్లిపోతానని నాకు తెలిసినప్పటికీ.. నేను నా ఉద్యోగంతో సంతోషంగా ఉన్నాను. కాబట్టి దయచేసి చింతించడం మానేయండి. నీ దుఃఖాన్ని చూసి నేను సంతోషించను.” దీని నుంచి మనం గమనించాల్సిన విషయం ఎమిటంటే.. తల్లిదండ్రులు తమ పిల్లలు చేసే తప్పులను సరిదిద్దుతారు. వారికి ఎల్లప్పుడూ అండగా నిలుస్తారు. ఇదే సమయంలో పెద్దలు చేసే తప్పుల వల్ల పిల్లలు ఎలా ఇబ్బందులు ఎదుర్కొంటారో ఆనంద్ మహీంద్రా వివరించిన విషయం కూడా చాలా గమనించాల్సిందే.
English summary
business tycoon anand mahidra commented over harsh goenkas tweet going viral that has motivational message
business tycoon anand mahidra commented over harsh goenkas tweet truely inspiring everyone
Story first published: Monday, July 4, 2022, 13:18 [IST]