News

oi-Srinivas G

|

గత ఏడాది అక్టోబర్ నెల నుండి ఫారెన్ ఇన్వెస్టర్స్ పెట్టుబడులు 33 బిలియన్ డాలర్ల మేర క్షీణించాయి. ఇది భారత మార్కెట్ క్యాపిటలైజేషన్‌కు ఒక శాతంతో సమానం. కరోనా సమయంలో పారెన్ ఇన్వెస్టర్స్ తమ పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. అయితే ఆ తర్వాత కాస్త సానుకూలంగా కనిపించినప్పటికీ, రష్యా – ఉక్రెయిన్ యుద్ధం ప్రభావం కూడా పడింది. అప్పటి నుండి పెద్ద ఎత్తున పెట్టుబడులు వెనక్కి తరలి వెళ్తున్నాయి.

ఇందులో అత్యధికంగా జూన్ నెలలో తరలి వెళ్లాయి. జూన్ నెలలో 6.3 బిలియన్ డాలర్ల పెట్టుబడులను FPIలు వెనక్కి తీసుకున్నారు. గత రెండేళ్ల కరోనా కాలంలో ఓ నెలలో అత్యధికంగా వెనక్కి వెళ్లడం ఇదే మొదటిసారి. భారత్ నుండి చైనా/ఆసియాన్‌కు డబ్బును తరలించినట్లుగా గోల్డ్‌మన్ శాక్స్ ఆసియా – పసిఫిక్ ఈక్విటీ స్ట్రాటెజిస్ట్ వెల్లడించారు.

అక్టోబర్ నుండి పెద్ద ఎత్తున వెనక్కి వెళ్లిన ఫారెన్ ఇన్వెస్టర

అలాగే, ప్రపంచ, దేశీయ ఆర్థిక పరిస్థితులు, రూపాయి మారకంతో పోలిస్తే డాలర్ బలపడటం, వృద్ధి మందగమనం వంటి అంశాలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి. కరోనా తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్నప్పటికీ, విదేశీ పెట్టుబడులు వెనక్కి మరలుతుండటం గమనార్హం.

English summary

Foreign investors dump record $33bn of Indian stocks since October

Foreign investors have dumped a record $33bn of Indian shares since October last year, equivalent to 1 per cent of India’s market capitalisation, according to Goldman Sachs.

Story first published: Tuesday, July 5, 2022, 16:25 [IST]



Source link

Leave a Reply

Your email address will not be published.