వేల ఉద్యోగుల నియామకం..

యూరప్‌లోని అతిపెద్ద హోటళ్ల వ్యాపారి అకార్, ప్రపంచవ్యాప్తంగా తమ సంస్థలకు అవసరమైన 35,000 పోస్టులను భర్తీ చేయడానికి పరిశ్రమలో ఇంతకు ముందు అనుభవం లేని వ్యక్తులను నియమించుకుంటోంది. కంపెనీ రిక్రూట్ ప్రక్రియను కేవలం 24 గంటల్లోనే పూర్తి చేస్తోంది. పైగా ఈ కార్మికులకు ఉద్యోగంపై ఆరు గంటల పాటు శిక్షణను అందిస్తోంది.

స్పెయిన్ లో పరిస్థితి ఇలా..

స్పెయిన్ లో పరిస్థితి ఇలా..

స్పెయిన్ క్యాటరింగ్ పరిశ్రమలో 2,00,000 మంది కార్మికులు తక్కువగా ఉన్నారు. అయితే పోర్చుగీస్ హోటళ్లకు కనీసం 15,000 మంది ఉద్యోగుల అవసరం ఉంది. కరోనా నుంచి కోలుకుంటున్న సమయంలో వ్యాపారాలకు పెరుగుతున్న డిమాండ్‌ను కొనసాగించడానికి భారతదేశ ఆతిథ్య పరిశ్రమకు దాదాపు 3,50,000 మంది ఉద్యోగుల అవసరం ఉంది. ఇందుకోసం కొన్ని బడా కంపెనీలు, కుటుంబ వ్యాపారాలు కలిగిన సంస్థలు విద్యార్థులను, వసల కార్మికులను నియమించుకుంటున్నాయి. ఇందులో ఇబ్బంది ఏమిటంటే విద్యార్థులు కేవలం సెలవుల సమయంలో మాత్రమే ఉద్యోగాలకు వస్తారు కాబట్టి కంపెనీలకు ఇది పూర్తి స్థాయి పరిష్కార మార్గం కాదు.

కరోనా కారణంగా..

కరోనా కారణంగా..

లాక్‌డౌన్‌లు అమల్లోకి రావటం, ప్రయాణాలు నిలిచిపోవటం వంటి కారణాల వల్ల ఆతిథ్య పరిశ్రమ COVID-19 సమయంలో విపరీతమైన కార్మికుల వలస సమస్యను ఎదుర్కొంది. గత సంవత్సరం మిలియన్ లేదా 6.4% మంది రెస్టారెంట్ అండ్ హోటల్ కార్మికులు నిష్క్రమించడంతో నవంబర్‌లో అట్రిషన్ గరిష్ఠ స్థాయికి చేరుకుంది. అయితే చాలా మంది ఉద్యోగులు తిరిగి రాకూడదని నిర్ణయించుకోవటంతో ఈ రంగాన్ని అద్యోగుల సంక్షోభం వేధిస్తోంది. అయితే.. ఎక్కువ పని గంటలు, పెరుగుతున్న అతిథి డిమాండ్లు, తక్కువ వేతనాలను ఉద్యోగులు కారణాలుగా చెబుతున్నారు.

ఉద్యోగులను ఆకర్షించేందుకు..

ఉద్యోగులను ఆకర్షించేందుకు..

హోటల్ యజమానులు సిబ్బందిని ఆకర్షించడానికి అధిక వేతనం, ఉచిత వసతి, బోనస్‌లు, హెల్త్ ఇన్సూరెన్స్ లను అందిస్తున్నాయి. స్పెయిన్‌లో బార్‌లు, రెస్టారెంట్లు మొదటి త్రైమాసికంలో కార్మికుల వేతనాలను అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే దాదాపు 60% పెంచాయి. పోర్చుగల్‌లో హాస్పిటాలిటీ కార్మికులకు ఈ ఏడాది జీతాలు 7% మేర పెరగవచ్చు. ఈ లేబర్ క్రంచ్ మధ్య కొన్ని హోటళ్లు ఆహారం, వాక్యూమ్ కామన్ స్పేస్‌లు, క్లీన్ ఫ్లోరింగ్, సిబ్బందికి సహాయపడే రోబోట్‌లలో పెట్టుబడులు పెడుతున్నాయని వాషింగ్టన్ పోస్ట్ వెల్లడించింది.Source link

Leave a Reply

Your email address will not be published.