మార్కెట్ల పతనంతో..

స్టాక్ మార్కెట్‌లో బిగ్ బుల్‌గా పేరుగాంచిన రాకేష్ జున్‌జున్‌వాలా ఈ ఆర్థిక సంవత్సరం మెుదటి క్వార్టర్ లో భారీ నష్టాన్ని చవిచూశారు. చాలా కంపెనీల షేర్లు భారీగా పతనం కావడంతో రాకేష్ జున్‌జున్‌వాలా ఆస్తుల క్షీణతకు కారణమైంది. జనవరి నుంచి మార్చి 2022 మధ్య కాలంలో జున్‌జున్‌వాలా ఆస్తులు రూ. 33,753.92 కోట్లుగా ఉన్నాయి. అయితే చాలా మంది ఇన్వెస్టర్లు బిగ్ బుల్ పోర్ట్ ఫోలియోను రెగ్యులర్ గా ఫాలో అవుతుంటారు. ఆయన చేసే కొనుగోళ్లకు అనుగుణంగా కొనటం లేదా అమ్మటం వంటివి కూడా చేస్తుంటారు.

33 కంపెనీల్లో పెట్టుబడులు..

33 కంపెనీల్లో పెట్టుబడులు..

రాకేష్ జున్‌జున్‌వాలా 33 పబ్లిక్‌గా లిస్టెడ్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు. వాటిలోనూ ఆయన టైటాన్‌లో భారీ మెుత్తంలో పెట్టుబడి పెట్టాడు.రాకేష్ జున్‌జున్‌వాలా ఈ కంపెనీలో రూ.8,728.9 కోట్లు, స్టార్ హెల్త్‌లో రూ.4,755.2 కోట్లు, మెట్రో బ్యాండ్‌లో రూ.2,431.8 కోట్లు పెట్టుబడి పెట్టారు.బిగ్ బుల్ టాటా మోటార్స్‌లో రూ.1,619.8 కోట్లు, క్రిసిల్‌లో రూ.1315 కోట్లను ఇన్వెస్ట్ చేశారు.

ఏ స్టాక్స్ వల్ల నష్టం వచ్చింది..

ఏ స్టాక్స్ వల్ల నష్టం వచ్చింది..

ఈ ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టల్లో డెల్టా కార్ప్, నెట్‌వర్క్ 18 షేర్లు 48% నష్టపోయాయి. మరోవైపు ఇండియాబుల్స్ స్టాక్ ధర 45%, నాల్కో 44%, ఇండియాబుల్స్ ఫైనాన్స్ 43% మేర క్షీణించాయి. వీటికి తోడు ఆప్టెక్, డిష్‌మన్ కార్బోజెన్, స్టార్ హెల్త్ వంటి స్టాక్‌లు 30 నుంచి 40 శాతం వరకు పడిపోయాయి.Source link

Leave a Reply

Your email address will not be published.