లాభాల్లో దూసుకుపోతూ..

ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది ఓరియంట్ బెల్(Orient Bell) షేర్ గురించే. ఇది స్మాల్‌క్యాప్ సెగ్మెంట్ కు చెందిన ఒక స్టాక్. ఓరియంట్ స్టాక్ తన ఇన్వెస్టర్లకు అనతి కాలంలోనే బంపర్ రిటర్న్ అందించింది. ఈ క్రమంలో షేరు ధర రూ.53.75 స్థాయి నుంచి పెరుగుతూనే ఉంది. ఈ రోజు NSEలో ఉదయం 11.25 నిమిషాల సమయంలో స్టాక్ 10 శాతం కంటే ఎక్కువ లాభపడి రూ.765 వద్ద ట్రేడ్ అవుతోంది. గత నెలాఖరులో క్రిసిల్ కంపెనీ క్రెడిట్ రేటింగ్ ను సవరించడంతో స్టాక్ మార్కెట్లో రాకెట్ లాగా దూసుకుపోతోంది.

 రెండేళ్లలో కాలంలో రిటర్న్స్..

రెండేళ్లలో కాలంలో రిటర్న్స్..

గత వారంలో కంపెనీ షేరు 20 శాతం ఎగబాకింది. ఈ సమయంలో కంపెనీ స్టాక్ రూ. 120.95 పెరిగింది. ఇది కాకుండా గడచిన ఏడాది సమయాన్ని పరిశీలించినట్లయితే.. ఈ సమయంలో కంపెనీ షేర్లలో 104.53 శాతం పెరిగింది. ఈ సమయంలో కంపెనీ షేరు రూ.358.75 పెరిగింది. నేడు కంపెనీ షేరు మార్కెట్‌లో రూ.765 స్థాయిలో ట్రేడవుతోంది. కంపెనీ షేరు 29 మే 2020న NSEలో ఒక్కొక్కటి రూ. 53.75గా ఉంది. అంటే ఈ రెండు సంవత్సరాల్లో స్టాక్ 14 రెట్లకు పైగా పెరిగింది. అదే ఐదేళ్ల కాలాన్ని గమనించినట్లయితే.. షేర్ 150.79 శాతం లాభాన్ని అందించింది.

పెట్టుబడిపై రాబడి ఇలా..

పెట్టుబడిపై రాబడి ఇలా..

ఒక ఇన్వెస్టర్ గత వారం సెషన్ ప్రారంభంలో ఈ మల్టీబ్యాగర్ స్టాక్‌లో లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టి ఉంటే.. అప్పుడు దాని విలువ 1.20 లక్షలకు పైగా ఉండేది. 2022 కొత్త సంవత్సరం ప్రారంభంలో ఒక పెట్టుబడిదారుడు ఈ స్టాక్ లో లక్ష పెట్టుబడి పెట్టినట్లయితే.. ఇప్పుడు దాని విలువ రూ. 2.05 లక్షలకు చేరుకునేది. అదే విధంగా.. ఒక ఇన్వెస్టర్ ఏడాది క్రితం ఈ స్టాక్‌లో లక్ష పెట్టుబడి పెట్టినట్లయితే.. ఇప్పుడు అవి రూ. 2.25 లక్షలు అయి ఉండేది. రెండేళ్ల క్రితం ఈ మల్టీబ్యాగర్ స్టాక్ లో లక్ష పెట్టుబడి పెట్టినట్లయితే ఇప్పుడు దాని విలువ ఈ రోజు రూ.14 లక్షలకు పైగానే ఉండేది.Source link

Leave a Reply

Your email address will not be published.