News
oi-Mamidi Ayyappa
Viral News: కరోనా మహమ్మారి తర్వాత అనేక మందికి ఉద్యోగాలు కనుగొనడం కష్టంగా మారింది. అయితే.. జొమాటో టీషర్ష్ లో ఒక వ్యక్తి ఉద్యోగం కోసం కొత్త పరిష్కార మార్గంతో ముందుకు వచ్చాడు. ఉద్యోగం పొందటానికి అతడు తన రెజ్యూమ్ ను ఒక కేక్ బాక్సులో ఉంచి కంపెనీ యజమానులకు డెలివరీ ఇస్తూ వారి అటెంన్షన్ పొందేందుకు ప్రయత్నించాడు. అతను తన రెజ్యూమ్ని బెంగళూరులోని అనేక స్టార్టప్‌లకు ఇలా పంపుతున్న వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. చాలా రెజ్యూమ్ లు చెత్తలోకి వెళతాయి, కానీ నాది మీ కడుపులోకి వెళుతుందని అంటూ ఆ పెట్టెలో రాశాడు. ఇలా సదరు వ్యక్తి తనలోని మార్కెటింగ్ ట్యాలెంట్ ను బయటపెట్టాడు.
దృష్టిని ఆకర్షించేందుకు..
ప్రస్తుతం ఈ వ్యక్తి ఉద్యోగం కోసం చేసిన ప్రయత్నం సోషల్ మీడియా ట్విట్టర్ లో వైరల్ గా మారింది. ఇతని ప్రయత్నాన్ని అనేక మంది అభినందిస్తున్నారు. అమన్ తన ట్వీట్‌కి 3.8K లైక్‌లు రావడంతో యజమానుల దృష్టిని మాత్రమే కాకుండా.. నెటిజన్ల దృష్టిని కూడా ఆకర్షించాడు. అతను మేనేజ్మెంట్ ట్రైనీగా ఉద్యోగం కోసం చూస్తున్నాడని తెలుస్తోంది. కామెంట్స్ ఏరియాలో పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

మార్కెటింగ్ స్కిల్స్ కు ఫిదా..
డిజిటల్ గురుకుల్ మెటావర్సిటీ అతని మార్కెటింగ్ సామర్థ్యాలతో ఎంతగానో ఆకర్షితమైంది. వారు అతనికి ఇంటర్న్‌షిప్ అందించారు. “మీ మార్కెటింగ్ నైపుణ్యాన్ని పరిశీలిస్తే – ఇంటర్న్‌షిప్‌తో ఉచితంగా “డిజిటల్ స్టార్టప్”లో మా ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్‌ను అందించాలనుకుంటున్నాము!” అని కంపెనీ ట్వీట్ కామెంట్ బాక్స్ లో పేర్కొంది. ఇది మీ పొట్ట మరియు వృత్తిని చక్కదిద్దుకోవడానికి మీకు సహాయపడుతుందని ఆశిస్తున్నాను.”
Thank you for all the support
Currently I am looking for a management trainee or APM role at a good organization.
Here is my linkedin profile : https://t.co/hQQi4hMmaA— Aman Khandelwal (@AmanKhandelwall) July 3, 2022
English summary
a man in bangalore delivered his resumes to start ups in pastry box dressed as zomato delivery boy going viral
job seeker delivered his resume dressing as zomato boy in bangalore going viral
Story first published: Tuesday, July 5, 2022, 11:42 [IST]