హిందూ మరియు వేద జ్యోతిష్యశాస్త్రం ప్రకారం పంచాంగానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. అందుకే మన భారతీయులు హిందూ పంచాంగాన్ని మాత్రమే శుభకార్యాలను, పండుగలను, వ్రతాలను, ఉపవాస ఆచారాలను పరిగణనలోకి తీసుకుంటారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం, తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం ఈ ఐదింటిని కలిపి పంచాంగం అని భావిస్తారు. ఈ పంచాంగం శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు, దుర్ముహుర్తం, యమగండం, రాహూకాలం, సూర్యోదయం, సూర్యాస్తమయం వంటి ముఖ్యమైన విషయాల గురించి వివరిస్తుంది. పంచాగం లెక్కించడానికి అనేక పద్ధతులు అందుబాటులో ఉన్నప్పటికీ ఇప్పటికీ సూర్యమానం, చాంద్ర మాన విధానాలనే అనుసరిస్తున్నారు. సూర్యుడి సంచారంతో అనుసంధానమైనది సూర్యమాన పంచాంగం, అదే విధంగా చంద్రుని సంచారంతో అనుసంధానమైనది చంద్రుని పంచాంగం. తెలుగువారు ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు. అందుకే చాంద్రమానం ప్రకారం, తెలుగు నూతన సంవత్సరం ఛైత్ర మాసంతో ప్రారంభమవుతుంది. ఫాల్గుణ మాసంతో ముగుస్తుంది. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. ఈ సందర్భంగా నేటి 7 జూలై గురువారం వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.


రాష్ట్రీయ ఆషాఢ మితి 16, శాఖ సంవత్సరం 1944, ఆషాఢ శుక్ల, అష్టమి, గురువారం, విక్రమ సంవత్సరం 2079. సౌర ఆషాఢ మాసం ప్రవేశం 23, జిల్హిజా 07, హిజ్రీ 1443(ముస్లిం), AD ప్రకారం, ఇంగ్లీష్ తేదీ 07 జులై 2022

సూర్యుడు దక్షిణయానం నుండి ఉత్తర ప్రదక్షిణ, వర్ష బుుతువు, రాహుకాలం మధ్యాహ్నం 01:30 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. అష్టమి తిథి సమయం 7:29 గంటల వరకు, అష్టమి తర్వాత నవమి తిథి ప్రారంభం, హస్తా నక్షత్రం, చిత్రా నక్షత్రం మధ్యాహ్నం 12:20 గంటల తర్వాత ప్రారంభం, ఉదయం 10:38 గంటల తర్వాత పరిఘ్ యోగం, శివ యోగం ప్రారంభమవుతుంది.

బాలవ్ కరణం తర్వాత విశిష్టి కరణం ఉదయం 7:38కి ప్రారంభమవుతుంది. అర్ధరాత్రి 12:22 నిమిషాలకు చంద్రుడు కన్య రాశి నుండి తులరాశిలోకి సంచారం చేయనున్నాడు.

నేడు ఉపవాస పండుగ : శ్రీ దుర్గాష్టమి

సూర్యోదయం సమయం 7 జులై 2022: ఉదయం 5:29 గంటలకు
సూర్యాస్తమయం సమయం 7 జులై 2022 : సాయంత్రం 7:23 గంటలకు

నేటి 7 జులై 2022 శుభ ముహుర్తాలివే..
బ్రహ్మా ముహుర్తం : తెల్లవారుజామున 04:08 నుండి 04:49 గంటల వరకు అభిజిత్ ముహుర్తం : ఉదయం 11:58 నుండి 12:54 గంటల వరకు
విజయ ముహుర్తం : మధ్యాహ్నం 2:45 నుండి మధ్యాహ్నం 3:40 గంటల వరకు
నిశిత కాలం : అర్ధరాత్రి 12:06 నుండి మరుసటి రోజు 12:46 గంటల వరకు
సంధ్యా సమయం : సాయంత్రం 7:09 నుండి సాయంత్రం 7:33 గంటల వరకు
అమృత కాలం : ఉదయం 6:11 నుండి ఉదయం 7:49 గంటల వరకు

నేటి 7 జూలై 2022 అశుభ ముహుర్తాలివే..
రాహూకాలం : ఉదయం 12:01 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు
గులిక్ కాలం : ఉదయం 10:30 నుండి ఉదయం 12 గంటల వరకు
యమగండం : ఉదయం 7:30 నుండి ఉదయం 9 గంటల వరకు
దుర్ముహర్తం : ఉదయం 10:07 నుండి ఉదయం 11:03 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 3:40 నుండి సాయంత్రం 4:36 గంటల వరకు
భద్ర కాలం : ఉదయం 5:29 నుండి ఉదయం 7:43 గంటల వరకు

– ఆచార్య కృష్ణ దత్త శర్మSource link

Leave a Reply

Your email address will not be published.